IPL 2025: చెన్నై పరాజయం ఆగుతుందా? పంజాబ్‌కు సొంతగడ్డ శాపిస్తుందా?

IPL 2025 Can Chennai Halt Losing Streak Will Punjabs Home Ground Prove Unlucky Again
x

IPL 2025: చెన్నై పరాజయం ఆగుతుందా? పంజాబ్‌కు సొంతగడ్డ శాపిస్తుందా?

Highlights

IPL 2025: ఐపీఎల్ రసవత్తరంగా కొనసాగుతోంది. మంగళవారం ఎవరికి అదృష్టం కలిసొస్తుంది. ఏ జట్టు విజయం సాధిస్తుంది? ఏ జట్టు ఓటమి చవిచూస్తుంది?

IPL 2025: ఐపీఎల్ రసవత్తరంగా కొనసాగుతోంది. మంగళవారం ఎవరికి అదృష్టం కలిసొస్తుంది. ఏ జట్టు విజయం సాధిస్తుంది? ఏ జట్టు ఓటమి చవిచూస్తుంది? ఐపీఎల్ 2025లో వారం మధ్యలో కూడా డబుల్ హెడర్ మ్యాచ్‌ల ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 8న జరిగే మొదటి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడతాయి. ఇక రెండో మ్యాచ్‌లో ఐపీఎల్ లోని రెండు బలమైన జట్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) ఢీకొంటాయి. మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుండగా, రెండో మ్యాచ్ పంజాబ్ కొత్త హోమ్ గ్రౌండ్ ముల్లాన్‌పూర్‌లో జరుగుతుంది.

ఈ సీజన్‌లో తమ సొంత మైదానాల్లో కోల్‌కతా, పంజాబ్ జట్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ కూడా తమ తొలి విజయాన్ని సొంతగడ్డపై నమోదు చేయలేకపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడగా, ఒక విజయం, ఒక ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ముల్లాన్‌పూర్‌లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడింది. అందులో ఓడిపోయింది. దీంతో లక్నో, చెన్నై జట్లకు మంచి అవకాశం లభించినట్లే.

చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే, ఈ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్ ఓడిపోయే ప్రమాదంలో ఉంది. ఒకవేళ అలా జరిగితే, లీగ్‌లో CSK కష్టాలు పెరుగుతాయి. ఆ తర్వాత జరిగే అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాల్సిన ఒత్తిడి వారిపై ఉంటుంది. దీంతో ఎలాగైనా తమ ఓటమి పరంపరకు అడ్డుకట్ట వేయాలని CSK భావిస్తోంది. అందుకు ముల్లాన్‌పూర్ కంటే మంచి వేదిక మరొకటి ఉండకపోవచ్చు.

పంజాబ్ కింగ్స్ ఇతర జట్ల సొంతగడ్డపై ఆడినప్పుడల్లా విజయం సాధిస్తూ వచ్చింది. కానీ, గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తమ హోమ్ గ్రౌండ్ ముల్లాన్‌పూర్‌లో ఆడినప్పుడు ఓటమి పాలైంది. CSK కూడా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తోంది. అయితే, ఇందుకోసం CSK టాప్ ఆర్డర్ తప్పకుండా రాణించాల్సి ఉంటుంది. IPL 2025లో CSK పరిస్థితి అంత బాగోలేకపోవడానికి ప్రధాన కారణం వారి టాప్ ఆర్డర్ ఒకేసారి రాణించకపోవడమే.

Show Full Article
Print Article
Next Story
More Stories