నేడు ఐపీఎల్ ఫైనల్.. గుజరాత్ వర్సెస్ రాజస్థాన్.. టైటిల్ షాట్ ఎవరిదో..!

IPL 2022 Final Match Today Between Rajasthan Royals and Gujarat Titans in Narendra Modi Stadium | Live News
x

నేడు ఐపీఎల్ ఫైనల్.. గుజరాత్ వర్సెస్ రాజస్థాన్.. టైటిల్ షాట్ ఎవరిదో..!

Highlights

IPL 2022 Final - RR vs GT: ఐపీఎల్ 2022 ముగింపునకు ఆతిథ్యం ఇవ్వనున్న మొతేరా

IPL 2022 Final - RR vs GT: ఐపీఎల్-15వ సీజన్ ముగింపుదశకు చేరుకుంది. మొత్తం పది జట్లతో రెండు గ్రూపులుగా విడిపోయి రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఈ మెగా టోర్ని ఉర్రూతలూగించింది. ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ సీజన్ ద్వారానే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో ఆడి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. క్వాలిఫయర్-వన్ లోనూ అదే తరహా ఆట తీరు కనబరిచి రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి నేరుగా ఫైనల్స్ చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో బెంగళూరును ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ రెండు జట్లు మరోసారి పోటీ పడుతుండటంతో విజేత ఎవరన్నది ఆసక్తి కల్గిస్తుంది.

గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టులోనూ బ్యాట్స్ మెన్ మంచి ఫాంలో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టులో కెప్టెన్ హార్ధిక పాండ్యా ముందుండి నడిపిస్తుండగా.. డేవిడ్ మిల్లర్ ప్రతి మ్యాచ్ కు మెరుగవుతున్నాడు. అటు రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలు సాధించిన బట్లర్.. ఫైనల్స్ లోనూ చెలరేగితే గుజరాత్ బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మిడిలార్డర్ హెట్మేయర్, దేవదత్ పడిక్కల్, రియానా పరాగ్ కూడా రాణిస్తున్నారు.

గుజరాత్ టీంలో షమీ, రషీద్ ఖాన్ బౌలింగ్ విషయంలో కీలకం కానున్నారు. రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే కాదు.. బ్యాటింగ్ లోనూ అద్బుతంగా ఆడుతాడన్న గుర్తింపు ఉంది. ఫైనల్స్ లో తన ట్రేడ్ మార్క్ స్నేక్ షాట్ ఆడుతానని రషీద్ చెబుతున్నాడు. ఏది ఏమైనా రెండు బలమైన జట్ల మధ్య ఐపీఎల్ టైటిల్ పోరు జరుగుతుండటంతో క్రీడాభిమానుల్లో ఏదేమైనా రెండు బలమైన జట్ల మధ్య ఐపీఎల్ టైటిల్ పోరు జరగనుండడం క్రికెట్ అభిమానులకు ఎంటర్ టైన్ మెంట్ హై రేంజిలో లభించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories