నేటి నుంచే ఐపీఎల్ 15వ సీజన్.. తొలిమ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ Vs కోల్ కతా నైట్ రైడర్స్

IPL 2022 15th Season First Match Today CSK vs KKR | IPL 2022 Highlights
x

నేటి నుంచే ఐపీఎల్ 15వ సీజన్.. తొలిమ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ Vs కోల్ కతా నైట్ రైడర్స్

Highlights

IPL 2022: ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ ఇమేజెస్...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ ఇవాళ ప్రారంభం కాబోతోంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగే క్రికెట్ మ్యాచులో చెన్నసూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి గడచిన 2021 సీజన్ దాకా ఇరు జట్లు 25 మ్యాచుల్లో తలపడ్డాయి చెన్నై సూపర్ కింగ్స్ 17 మ్యాచుల్లోనూ.... కోల్కతా నైట్ రైడర్స్ 8 మ్యాచుల్లోనూ విజయం సాధించాయి.

రెండు ఫ్రాంచైజీలు పాతవే అయినప్పటికీ... సారథులు మాత్రం కొత్తవాళ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీనుంచి ధోనీ తప్పుకున్న తర్వాత... ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పగ్గాలు చేపట్టాడు. కోల్కతా జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇవాళ జరిగే ఆరం మ్యాచులో తలపడనున్న ఈ జట్లు క్రికెట్ అభిమానులకు బౌండరీలు, సిక్సర్లతో వినోదాన్ని పంచబోతున్నారు.

ప్రారంభ మ్యాచులో సత్తాచాటి, సాధికార విజయాన్ని చేజిక్కించుకోవాలని కోల్కతీ జట్టు ఆశిస్తోంది. ధోనీ నుంచి బాధ్యతలు అందుకున్న జడేజా ఇవాళ జరిగే మ్యాచులో కీలక పాత్ర పోషించి విజయాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. మరి ప్రారంభ మ్యాచులో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories