IPL 2021 SRH vs RCB: టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్

IPL 2021: Toss Won By Sunrisers Hyderabad and Choose Bowl First
x

డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ (ఫొటో ట్విట్టర్)

Highlights

IPL 2021 SRH vs RCB: ఐపీఎల్ 2021 సీజన్ లో 6 వ మ్యాచ్ లో భాగంగా నేడు ‌ బెంగళూరుతో హైదరాబాద్‌ తలపడనుంది.

IPL 2021 SRH vs RCB: ఐపీఎల్ 2021 సీజన్ లో 6 వ మ్యాచ్ లో భాగంగా నేడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. టాస్ గెలిచిన సన్ రైజర్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదట ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. కోహ్లీ సేనను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

మొదటి మ్యాచ్ లో గెలిచి ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది కోహ్లీ సేన. మరోవైపు మొదటి మ్యాచ్‌లో ఓడి, ఎలాగైన గెలవాలనే కసితో వార్నర్ సేన బరిలోకి దిగనుంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉన్నారు. ఈ మ్యాచ్ కూడా అభిమానులకు పరుగుల విందును అందిస్తుందనడంలో సందేహం లేదు.

జట్ల వివరాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ ఎలెవన్): వృద్దిమాన్ సాహా (కీపర్), డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, షాబాజ్ నదీమ్

Show Full Article
Print Article
Next Story
More Stories