IPL 2021 RR vs DC Preview: గాయంతో బెన్‌స్టోక్స్ రాజస్థాన్‌కు దూరం... ఢిల్లీ టీంలో రబాడ ఎంట్రీ

IPL 2021 RR vs DC Preview: Rajasthan Royals Vs Delhi Capitals
x

ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

RR vs DC Preview: ఐపీఎల్ 2021 సీజన్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ కి ముంబయిలోని వాంఖడే స్టేడియం గురువారం వేదిక కానుంది.

IPL 2021 RR vs DC Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ కి ముంబయిలోని వాంఖడే స్టేడియం గురువారం వేదిక కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ని చిత్తుగా ఓడించేసింది ఢిల్లీ క్యాపిటల్స్‌. అలాగే పంజాబ్ కింగ్స్‌కి చివరి బాల్ దాకా ముచ్చెమటలు పట్టించేసింది రాజస్థాన్ రాయల్స్. రెండు టీంలలోనూ టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో 189 పరుగుల లక్ష్యఛేదనను ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 18.4 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఔరా అనిపించింది. అందుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కూడా అలాంటి తెగువనే చూపించింది. కానీ.. చివరి బంతికి కెప్టెన్ సంజు శాంసన్ సిక్స్ కొట్టలేకపోవడంతో 217/7 దగ్గరే ఆడిపోయింది. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో పోరు హోరాహోరిగా సాగనుంది.

ఎప్పుడు: రాజస్గాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (RR vs DC), ఏప్రిల్ 15, 2021, రాత్రి 7:30 గంటలకు

ఎక్కడ: వాంఖేడ్ స్టేడియం, మంబయి (Wankhed Stadium, Mumbai)

పిచ్: ముంబై పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా కనిపిస్తోంది. మరోసారి భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో కూడా 180 పరుగులపైనే నమోదయ్యాయి.

గెలుపోటములు (Head To Head):

రెండు టీం ల మధ్య ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో రెండు టీంలు తలో 11 మ్యాచ్‌లు గెలిచాయి. లాస్ట్ 5 మ్యాచ్‌ల్లో మాత్రం ఢిల్లీపై రాజస్థాన్ రాయల్స్ టీం గెలవలేదు. అలాగే ఇప్పటి వరకు ఢిల్లీపై రాజస్థాన్ టీం 150 పరుగుల మార్క్ ను దాటలేదు.

అత్యధిక స్కోర్లు:

ఐపీఎల్‌లో ఢిల్లీపై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 201 పరుగులు. అలాగే రాజస్థాన్‌పై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196 పరుగులు.

మీకు తెలుసా?

- శిఖర్ ధావన్ రాజస్థాన్ పై 19 ఇన్నింగ్స్‌ల్లో 32.17 యావరేజ్, 130.23 స్ట్రయికింగ్ రేట్ తో 547 పరుగులు సాధించాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

- రాజస్థాన్ రాయల్స్ టీం ఆటగాడు జాస్ బట్లర్ ఒక్కడే ఢిల్లీపై ఎక్కువ రన్స్ చేశాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 19.42 స్ట్రయికింగ్ రేట్ తో 179 పరుగులు సాధించాడు.

- ప్రస్తుతం ఇరు జట్లలో కెప్టెన్ లే కీపర్లు కావడం గమనార్హం

టీంల విశ్లేషణ:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్, పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అలాగే సిమ్రాన్ హిట్‌మెయర్, రిషబ్ పంత్‌కి ఫస్ట్ మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. ఇక బౌలింగ్ పరంగా క్రిస్‌వోక్స్, అవేష్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు సాధిస్తున్నారు. కానీ.. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, అమిత్ మిశ్రాలు తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చారు. క్వారంటైన్ కారణంగా ఫస్ట్ మ్యాచ్‌కి దూరమైన కగిసో రాబాడ.. ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. దీంతో టామ్ కరన్‌పై వేటు పడొచ్చు.

రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి ఫుల్ జోష్‌ లో ఉన్నాడు. అయితే.. ఇతర బ్యాట్స్ మెన్స్ నుంచి మాత్రం అతనికి సహకారం దొరకడం లేదు. డకౌటైన బెన్‌స్టోక్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికీ దూరమయ్యాడు. ఇది టీం కొంత నిరాశే. అతని స్థానంలో జోస్ బట్లర్ ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. ఇక మనన్ వోహ్రా, శివమ్ దూబే, రాహుల్ తెవాటియా రాణించాలని ఢిల్లీ టీం కోరుకుంటుంది. అయితే.. యువ హిట్టర్ రియాన్ పరాగ్ బెరుకు లేకుండా హిట్టింగ్ చేస్తుండడం ఢిల్లీ జట్టుకు శుభపరిణామం.

ఇక బౌలింగ్ పరంగా ఆల్‌రౌండర్ క్రిస్‌ మోరీస్ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అయితే.. యువ పేసర్ సకారియా మూడు వికెట్లు పడగొట్టడం కొంతమేర టీం కి భరోసా కల్పించాడు. ముస్తాఫిజుర్, శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ లో పస లేకపోవడంతో ఫస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ సంజు శాంసన్.. ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించాడు. ఫీల్డింగ్‌లోనూ ఆ జట్టు ఫస్ట్ మ్యాచ్‌లో చాలా తప్పిదాలు చేసి, ఎక్కువ పరుగుల సమర్పించుకుంది. దానికి మూల్యం కూడా చెల్లించుకుంది.

ప్లేయింగ్ లెవన్ (అంచనా)

రాజస్థాన్ రాయల్స్ : జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజూ శాంసన్ (కెప్టెన్, కీపర్), డేవిడ్ మిల్లెర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, శివం దుబే, శ్రేయాస్ గోపాల్, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా

ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానె, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, టామ్ కుర్రాన్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్

Show Full Article
Print Article
Next Story
More Stories