IPL 2021 RR Vs KKR: సత్తాచాటిన రాజస్తాన్ బౌలర్ల.. లక్ష్యం చిన్నదే

IPL 2021
x

RR

Highlights

IPL 2021: ఐపీఎల్ 2021సీజన్ లో భాగంగా వాఖండే వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్ జరుగుతుంది.

IPL 2021: ఐపీఎల్ 2021సీజన్ లో భాగంగా వాఖండే వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్లలు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి(36 26బంతుల్లో, 1ఫోర్లు, 2సిక్సులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లో మోరీస్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్‌, సకారియా, ఉనద్కత్‌ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌ ఆరంభించిన కోల్‌కతా కొద్దీ సేపటికే ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌(11) వికెట్ చేజార్చుకుంది. ముస్తాఫిజుర్‌ వేసిన ఈ ఓవర్‌లో సింగిల్‌ కోసం ప్రయత్నించి గిల్‌ రనౌటయ్యాడు.10 ఓవర్ల ముగిసేసమయానికి కోల్‌కతా మూడు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా(22)పరుగుల వద్ద చేతన్ బౌలింగ్ లో శాంసన్ క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. సునీల్ నరేన్(6), రసెల్‌(9), మోర్గాన్‌ (0) నిరాశపరిచారు. దినేశ్‌ కార్తీక్‌(25) పరుగులు చేసిన కాస్తో కూస్తో పర్వాలేదనిపించాడు. దినేశ్‌ కార్తీక్ కూడా వెంటనే అవుట్ కావడంతో కోల్ కతా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. ఆఖర్లో కమిన్స్ ప్రతిఘటించడంతో గౌరవప్రదమైన స్కోరు చేయకలిగింది.

కోల్‌కతా నైట్‌ రైడర్స్ నిర్థేశించిన 134పరుగలు లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో రాజస్థాన్ ఓపెనర్లు యశ్వస్వీ జైశ్వాల్, బట్లర్ ఇన్నింగ్స్ ఆరంభించారు. రెండు ఓవర్లు ముగిసే సమయానికి 12పరుగలు చేసింది. ఓపెనర్లు జైశ్వాల్ (11), బట్లర్ (1)పరగులుతో క్రీజులో కొనసాగతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories