RCB vs RR: రాయల్స్ పై పోటీకి ఛాలెంజర్స్ రెడీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - రాజస్తాన్ రాయల్స్ (ట్విట్టర్ ఫోటో)
* నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - రాజస్తాన్ రాయల్స్ మధ్య దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ పోరు
RCB vs RR: ఐపీఎల్ 2021 లో ప్లే అఫ్ చేరడం కోసం పలు జట్ల మధ్య పోరు హోరాహోరిగా సాగుతుంది. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న మ్యాచ్ లలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది ముంబై. ఇక ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్స్ రాణించడంతో తక్కువ పరుగులకే కట్టడి చేయడంతో పాటు గత కొంతకాలంగా బ్యాటింగ్ లో నిలదొక్కుకోలేక సతమతమవుతున్న హార్దిక్ పాండ్య 40 పరుగులతో నాటౌట్ గా నిలిచి ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - రాజస్తాన్ రాయల్స్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 7 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ పై ఘన విజయంతో మంచి ఊపు మీదున్న కోహ్లిసేన రాజస్తాన్ పై కూడా రాయల్ గా గెలిచి ప్లేఆఫ్ లోకి వెళ్ళడానికి పట్టుదలతో ఉంది. మాక్స్ వెల్, కోహ్లి ఫామ్ లోకి రావడంతో హర్షల్ పటేల్ తన బౌలింగ్ తో జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరోపక్క రాజస్తాన్ రాయల్స్ జట్టు ఇటీవలే సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలవడంతో 8 పాయింట్స్ తో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
ఈ రోజు (బుధవారం) జరబోయే మ్యాచ్ లో ఏ టీం గెలిచినా ప్లేఆఫ్ పోరు మరింత రసవత్తరంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. దుబాయ్ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు బెంగుళూరు - రాజస్తాన్ మధ్య జరిగిన 23 మ్యాచ్ లలో బెంగుళూరు 11, రాజస్తాన్ 10 మ్యాచ్ లలో గెలుపొందింది. బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన చివరి 3 మ్యాచ్ లలో 72,43,72 పరుగులు సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇరుజట్ల తుదిజట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు: విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడికల్, శ్రీకర్ భారత్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్: లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్/తబరైజ్ షమ్సి, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్/షేయాస్ గోపాల్, ముస్తాఫిజుర్ రహమాన్
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT