PBKS vs MI Match Preview: గెలుపు కోసం ఎంఐ, పంజాబ్ టీంల ఆరాటం; చెపాక్ లో చెలరేగేదెవరో?

IPL 2021 Punjab Kings Vs Mumbai Indians Match 17  Preview Today 23 04 2021
x

పంజాబ్ కెప్టెన్ రాహుల్, ముంబయి కెప్టెన్ రోహిత్ (ఫొటో ట్విట్టర్)

Highlights

PBKS vs MI Match Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు చెపాక్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్‌ తలపడనుంది.

PBKS vs MI Match Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు (శుక్రవారం) చెపాక్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి ప్రారంభం కానుంది.

హ్యాట్రిక్ ఓటములతో వెనుకబడిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి రేసులో నిలిచేందుకు ప్రణాళికలు వేస్తుంది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన ఎంఐ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ రాణించలేక ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రెండు జట్లు టోర్నీలో పుంజుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే.

ఎప్పుడు: పంజాబ్ కింగ్స్ vs ముంబయి ఇండియన్స్‌, శుక్రవారం, ఏప్రిల్ 23, రాత్రి 7:30 గంటలకు

ఎక్కడ: ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై(MA Chidambaram stadium, Chennai)

పిచ్: చెన్నై పిచ్ నెమ్మదిగా మారుతోంది. ఈ సీజన్ లో జరిగిన మొదటి 5 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 4 సార్లు గెలిచాయి. కానీ, చివరి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లోనూ టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకుంటుంది.

ముఖాముఖి పోరాటాలు: ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో ముంబయి టీమ్ గెలుపొందగా.. మిగిలిన 12 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించింది.

మీకు తెలుసా?

- కేఎల్ రాహుల్ ముంబయి ఇండియన్స్ పై 12 ఇన్నింగ్స్‌లలో 64.44 సగటుతో 580 పరుగులు, 131.22 స్ట్రైక్ రేట్ తో 5 సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు. అతని చివరి ఐదు ఇన్నింగ్స్ లు Vs ముంబయి ఇండియన్స్ : 94 (60), 71 * (57), 100 * (64), 17 (19) మరియు 77 (51).

- కీరోన్ పొలార్డ్ పంజాబ్‌తో జరిగిన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో 5సార్లు 200+ స్ట్రైక్ రేట్‌ తో పరుగులు సాధించాడు. అతని చివరి ఆరు ఇన్నింగ్స్ లు Vs పంజాబ్: 50 * (24), 50 (23), 7 (9), 83 (31), 47 * (20), 34 * (12).

- క్రిస్ గేల్ తన చివరి ఏడు T20 లలో ఒక్కసారి మాత్రమే 20 పరుగులు దాటాడు. హార్దిక్ పాండ్యా కూడా తన చివరి ఎనిమిది టీ 20 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే 20 పరుగులు దాటాడు.

- ముంబయి ఇండియన్స్ పేసర్లు, ఈ సీజన్‌ పవర్‌ప్లేలో వేసిన 18 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

టీంల బలాలు, బలహీనతలు

ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఫర్వాలేదనిపిస్తున్నా.. తన మార్క్ చూపించలేకపోతున్నారు. ఓపెనర్ డికాక్ గత రెండు మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. ఈ ఇద్దరి విఫలమవ్వడంతో మిడిలార్డర్‌పై భారం పడుతోంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఆదుకుంటున్నా.. టీం భారీ స్కోర్లు చేసేందుకు సహాయం చేయలేకపోతున్నారు. ఇక పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్యా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచాడు. కీరన్ పొలార్డ్ కూడా మెరిపించలేక పోతున్నాడు.

ఇక బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ జోడీ తమ మార్క్ బౌలింగ్ మాయాజాలం ప్రదర్శించలేకపోతున్నారు. వరుస నోబాల్స్‌తో బుమ్రా అధిక పరుగులు సమర్పించుకుంటున్నాడు. మరోవైపు ట్రెంట్ బౌల్ట్ పద్ధతిగా బౌలింగ్ చేసినా వికెట్లు రాబట్టలేకపోతున్నాడు. రాహుల్ చాహర్ ఒక్కడే మిడిల్ ఓవర్లలో ప్రత్యర్ధులను ఇబ్బంది పెడుతున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య తేలిపోయాడు. జయంత్ యాదవ్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ మ్యాచ్ లోనైనా అన్ని రంగాల్లో పుంజుకోవాలని ముంబయి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడుతోంది. ప్రస్తుతం వరుసగా విఫలమవుతూ టీం ఓడిపోవడానికి కారణం అవుతున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్ మెరుపులు ఒక్క ఓవర్‌కే పరిమితమతున్నాయి. ఇక నెం.4లో ఆడుతున్న నికోలస్ పూరన్ 4 మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా, షారూక్ ఖాన్‌లో మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ హిట్టింగ్‌తో ఆకట్టుకుంటున్నా... జట్టు విజయాలకు కారణం కాలేకపోతున్నారు.

బౌలింగ్‌ విషయానికి వస్తే.. పంజాబ్ జట్టు చాలా బలహీనంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసినా.. ఆ లక్ష్యాన్ని కాపాడడంలో బౌలర్లు తేలిపోతున్నారు. మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, మురగన్ అశ్విన్ మెరుపులు ఒక్క మ్యాచ్‌ కే పరిమితం అయ్యాయి. మిగతా మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. హెన్రిక్యూస్, ఫాబియన్ అలెన్ కూడా ప్రభావం చూపలేకపోతున్నారు. దీపక్ హుడా ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ వికెట్లు తీయలేకపోతున్నాడు.

ప్లేయింగ్ లెవన్(అంచనా)

ముంబయి ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్డ్.

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, మొయిసెస్ హెన్రిక్స్, షారుఖ్ ఖాన్, ఫాబియన్ అలెన్, ఎం అశ్విన్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories