PBKS vs KKR: నేడు పంజాబ్ తో కోల్‌కతా బిగ్ ఫైట్.. రికార్డులివే..

IPL 2021: Punjab Kings Vs Kolkata Knight Riders Match Records
x

పంజాబ్ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ రికార్డులు (ఫొటో కోల్‌కతా నైట్ రైడర్స్ ట్విట్టర్)

Highlights

IPL 2021: అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలిసారి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ తో కోల్‌కతా తలపడనుంది.

IPL 2021, PBKS vs KKR: అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి సారి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ తో కోల్‌కతా తలపడుతోంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7:30 గంటలకి ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2021 సీజన్ లో ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కింగ్స్.. 3 మ్యాచ్‌లు ఓడిపోయి.. రెండింట్లో గెలిచింది. ప్రస్తుతం 4 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు 5 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. కేవలం ఒకదాంట్లోనే గెలిచింది. 2 పాయింట్లతో చివరిస్థానంలో ఉంది.

హెడ్ టూ హెడ్ రికార్డులు: మొత్తం మ్యాచ్‌లు 27; కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచినవి 18; పంజాబ్ కింగ్స్ గెలిచివని 9

పంజాబ్‌పై కోల్‌కతా టీం అత్యధికంగా 245 పరుగులు చేయగా, కోల్‌కతాపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 214 పరుగులు.

మరికొన్ని విశేషాలు..

- కేకేఆర్‌పై అధిక పరుగులు సాధించిన వారిలో క్రిస్‌గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఉత్తమ సగటుతో పరుగులు సాధించాడు. 700పైగా స్ట్రయికింగ్ రేట్‌ను కలిగి ఉన్నాడు. అలాగే కోల్‌కతా పై గేల్ 54 సిక్సర్లు కొట్టాడు. ఓ టీంపై అత్యధికంగా సిక్సర్లు కొట్టిన లిస్టులోనూ గేల్ ముందున్నాడు.

- పంజాబ్‌తో జరిగిన ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు అర్ధ సెంచరీలు సాధించిన శుభమన్ గిల్ 104.50 సగటుతో 209 పరుగులు చేశాడు.

- ఐపీఎల్ 2020 లో రెగ్యులర్ ఓపెనర్‌లలో (123.44) గిల్ అతి తక్కువ ఎస్‌ఆర్‌ని కలిగి ఉన్నాడు, కానీ, 14 ఇన్నింగ్స్‌లలో నాలుగుసార్లు మాత్రమే అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో అతను రెండు ఇన్నింగ్స్‌లలో దూకుడుగా ఆడాడు. కానీ ఇప్పటికే ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం పవర్ ప్లే లోపల మూడుసార్లు అవుట్ అవ్వడం గమనార్హం.

- సునీల్ నరైన్ పంజాబ్‌పై 28 వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్ 29 వికెట్ల తర్వాత పంబాజ్ జట్టుపై రెండవ అత్యధికం నరైన్ దే. 18.18 సగటు, 6.97 ఎకానమితో నరైన్ 28 వికెట్లు పడగొట్టాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories