IPL 2021: పంజాబ్‌ ముందు స్వల్ప లక్ష్యం

IPL 2021
x

రోహిత్ శర్మ 

Highlights

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ లో భాగంగా చెన్నై వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ కొనసాగుతుంది. తొలుత టాస్‌ గెలిచి పంజాబ్ జట్టు...

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ లో భాగంగా చెన్నై వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ కొనసాగుతుంది. తొలుత టాస్‌ గెలిచి పంజాబ్ జట్టు ముందుగా ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ఆరంభించిన ముంబయి ఆదిలోనే ఓపెనర్ డికాక్ వికెట్ కోల్పోయింది. దీపక్‌ హుడా వేసిన బంతికి డికాక్‌(3) హెన్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆతర్వాత మూడో బ్యాట్స్ మెన్ గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌(6)ను రవి బిష్ణోయ్ ఔట్ చేశాడు. కిషన్‌ కీపర్ రాహుల్‌కి క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (63; 52 బంతుల్లో 5x4, 2x6)తో జతకలిసిన సూర్యకుమార్ యాదవ్‌ పంజాబ్ బౌలర్లపై విరుచుపడ్డాడు. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్‌లో రెండో బంతికి రోహిత్ శర్మ బౌండరీ బాది అర్ధశతకం పూర్తి చేశాడు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌(33; 27 బంతుల్లో 3x4, 1x6) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. అంతకుముందు ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(3), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌(6) పూర్తిగా విఫలమయ్యారు. దాంతో 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబయిని రోహిత్‌, సూర్య ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. అయితే చివర్లో ధాటిగా ఆడే క్రమంలో వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరారు. పొలార్డ్‌(16 నాటౌట్)గా నిలిచాడు. హార్దిక్‌ పాండ్య(1), కృనాల్‌ పాండ్య(3) సైతం ఆడలేకపోయారు. పంజాబ్‌ బౌలర్లలో షమి, బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు తీయగా దీపక్‌ హుడా, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలో వికెట్‌ తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories