logo
క్రీడలు

MI vs PBKS: ముంబైతో హోరాహోరి పోరుకు సిద్దమైన పంజాబ్

IPL 2021 Mumbai Indians vs Punjab Kings Match Today 28 07 2021 in Abu Dhabi
X

 హోరాహోరి పోరుకు సిద్దమైన ముంబై, పంజాబ్ (ఫైల్ ఫోటో)

Highlights

* ప్లేఆఫ్ బెర్త్ కోసం పోటీ పడుతున్న ముంబై, పంజాబ్ జట్లు

Mumbai Indians vs Punjab Kings: ఐపీఎల్ 2021 లో ప్లే ఆఫ్ కోసం పలు జట్లు పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ఫేవరేట్ జట్టుగా ఎంట్రీ ఇచ్చిన ముంబై ఇండియన్స్ వరుస ఓటమిలతో పాయింట్స్ టేబుల్ లో చివరి నుండి రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే రానున్న మ్యాచ్ లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ముంబై జట్టుది. మంగళవారం అబుదాభిలో సాయంత్రం 7:30 నిమిషాలకు జరగనున్న కీలక మ్యాచ్ లో తలపడబోతున్న ముంబై ఇండియన్స్ తో పాటు పంజాబ్ కింగ్స్ కూడా ఈ మ్యాచ్ లో విజయం కీలకంగా మారనుంది.

ప్రస్తుతం జరుగుతున్న కలకత్తా, ఢిల్లీ మ్యాచ్ ఫలితాన్ని పక్కనపెడితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు పది పాయింట్స్ తో టేబుల్ లో నాలుగో స్థానానికి వెళ్ళే ఛాన్స్ ఉండటంతో ఇరుజట్లు విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. అబుదాభి గ్రౌండ్ బ్యాటింగ్ కి అనుకులించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జరిగిన మ్యాచ్ లలోను పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించడం బ్యాట్స్ మెన్ కి కలిసొచ్చే అంశం. మరోపక్క బ్యాటింగ్ లో తడబడుతున్న ముంబై జట్టులో ఈరోజు జరగబోయే మ్యాచ్ లోనైనా సూర్య కుమార్, హార్దిక్, ఇషాన్ కిషన్ తిరిగి ఫామ్ లోకి రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

పంజాబ్ కింగ్స్ జట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రార్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్

Web TitleIPL 2021 Mumbai Indians vs Punjab Kings Match Today 28 07 2021 in Abu Dhabi
Next Story