Top
logo

DC vs MI, Match 13 Preview: ముంబయి ఇండియన్స్ ధాటికి ఢిల్లీ నిలబడేనా..?

IPL 2021 Mumbai Indians vs Delhi Capitals Match Preview | IPL 2021 Schedule
X

రిషభ్ పంత్, రోహిత్ శర్మ (ఫొటో ట్విట్టర్)

Highlights

DC vs MI, Match 13 Preview: నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ చెపాక్‌ స్టేడియంలో తలపడబోతున్నాయి.

DC vs MI, Match 13 Preview: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు 13 వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ చెపాక్‌ స్టేడియంలో తలపడబోతున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన రెండు జట్లూ.. రెండేసి విజయాలతో టాప్-4లో కొనసాగుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమతూకంతో కనిపిస్తున్నాయి. దీంతో.. మ్యాచ్ ఆసక్తికంగా ఉండనుంది.

ఎప్పుడు: ఢిల్లీ క్యాపిటల్స్ VS ముంబయి ఇండియన్స్, ఏప్రిల్ 20, 2021 రాత్రి 7:30

ఎక్కడ: ఎంఏ చిదబరం స్గేడియం, చెన్నై (MA Chidambaram Stadium, Chennai)

పిచ్: ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను బట్టి చూస్తే.. చెన్నై పిచ్ చేధనలో కష్టంగా మారుతోంది. మరోసారి టాస్ కీలకం కానుంది.

హెడ్ టూ హెడ్: ముఖాముఖి పోటీల్లో ఢిల్లీపై ముంబయి ఇండియన్స్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 16 మ్యాచ్‌ల్లో ముంబయి టీమ్, 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టు గెలుపొందింది. టోర్నీలో ఢిల్లీపై ముంబయి చేసిన అత్యధిక స్కోరు 218 పరుగులు. కాగా, ముంబయిపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 213 పరుగులు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఈ రెండు జట్లు ఏకంగా 4 సార్లు పోటీపడ్డాయి. ఇందులో ఫైనల్ కూడా ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌ ల్లో మూడు సార్లు ఛేదనకు దిగే ఢిల్లీపై ముంబయి గెలుపొందింది.

టీంల బలాలు:

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్‌లో బ్యాట్స్‌మెన్స్ కి పెద్దగా ఆడే అవకాశం రావడం లేదు. ఓపెనర్ శిఖర్ ధావన్.. వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ఇక పృథ్వీ షా.. పవర్‌ప్లేలో బౌలర్లని ఒత్తిడిలోకి నెడుతున్నాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్, హిట్టర్ మార్కస్ స్టాయినిస్.. కూడా అదే రేంజ్ లో బ్యాట్ ఝులిపిస్తున్నారు. అయితే.. నెం.3లో ఆడే సరైన బ్యాట్స్‌మెన్ జట్టుకి చాలా అవసరం. అజింక్య రహానెకి నెం.3లో రెండు సార్లు విఫలమయ్యాడు. పంజాబ్‌పై స్టీవ్‌స్మిత్‌ కూడా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు.

ఇక ఢిల్లీ బౌలింగ్ లో కగిసో రబాడ, క్రిస్‌వోక్స్ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఆరంభంలో అదగొడుతోన్నా.. డెత్ ఓవర్లలో పరుగుల్ని కట్టడి చేయలేకపోతున్నారు. అవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్‌లను మలుపు తిప్పేలా బౌలింగ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు.

ముంబై ఇండియన్స్(Mumbai Indians)

చెపాక్ వేదికగా గత శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 150 పరుగులే చేయగలిగింది. తక్కువ స్కోరే అయినా మెరుగైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. ఓపెనర్ డికాక్, రోహిత్ శర్మ భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నారు. ఇక నెం.4లో ఇషాన్ కిషన్, నెం.6లో హార్దిక్ పాండ్య వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఫెయిలయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. పవర్ హిట్టర్ కీరన్ పొలార్డ్ కూడా ముంబై బ్యాటింగ్ కి అండగా దుమ్ముదులుపుతున్నాడు.

కాగా, బౌలింగ్‌లో స్పిన్నర్ రాహుల్ చాహర్ మ్యాచ్‌లను మలుపు తిప్పే ప్రదర్శన చేస్తున్నారు. ఇక డెత్ ఓవర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా పరుగులను కట్టడి చేయలేక పోతున్నారు. మూడో పేసర్‌గా టీమ్‌లోకి వచ్చిన ఆడమ్ మిల్నే కూడా విఫలమవుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాత్మకంగా బౌలర్లని మారుస్తూ మెరుగైన ఫలితాల్ని రాబడుతున్నాడు.

వ్యూహాలు:

రిషభ్ పంత్ ని బూమ్రా 33 బంతులకు 5 సార్లు పెవిలియన్ కు పంపించాడు. అలాగే మ్యాచ్ ని మలుపు తిప్పడంలో బూమ్రా సిద్ధహస్తుడు. అలాగే స్టివ్‌స్మిత్ పై కూడా మంచి రికార్డునే కొనసాగిస్తున్నాడు ఈ ముంబై పేసర్.


మీకు తెలుసా?

ఢిల్లీ క్యాపిటల్స్ టీం చెపాక్ స్టేడియంలో చివరిసారి 2010 లో గెలిచింది. ఈ వేదికలో వరుసగా 6 సార్లు ఓడిపోయారు.

ప్లేయింగ్ లెవన్ (అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవెన్ స్మిత్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్, క్రిస్ వోక్స్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అవేష్ ఖాన్, అమిత్ మిశ్రా

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ఆడమ్ మిల్నే, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

Web TitleIPL 2021 Mumbai Indians vs Delhi Capitals Match Preview | IPL 2021 Schedule
Next Story