ఇద్దరు కోల్ కత్తా ఆటగాళ్లకు కరోనా..నేటి ఐపిఎల్ మ్యాచ్ వాయిదా

2 Kolkata Team Players Tested Corona Positive
x

వరుణ్ చక్రవర్తి  & సందీప్ వారియర్ 

Highlights

IPL 2021 KKR Vs RCB: నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది.

IPL 2021 KKR Vs RCB: ఆటగాళ్ల భయం నిజమైంది. బీసీసీఐ ఇచ్చిన భరోసా చెల్లలేదు. ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కోల్కతా టీమ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా పాజిటివ్ అని తేల్చారు. దీంతో నేడు జరగాల్సిన కోల్ కతా బెంగళూరు మ్యాచ్ ను వాయిదా వేశారు. అహ్మదాబాద్ మైదానంలో జ‌ర‌గాల్సిన ఈ మ్యాచ్ రీషెడ్యూలు తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కోల్‌క‌తా ఆట‌గాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్‌ వారియర్ ఇటీవ‌ల‌ గాయపడగా, వారిని స్కానింగ్‌ కోసం ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే, ఈ సంద‌ర్భంగా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయినట్లు స‌మాచారం.

ఈ మధ్యే విదేశీ ఆటగాళ్లు కొందరు కరోనా నీడలో ఆడలేమని వెళ్లిపోయారు. ఆ సమయంలో కరోనా ఇంతలా చెలరేగుతుంటే.. ఐపీఎల్ కు ఇంత ఖర్చు పెట్టి ఆడటం అవసరమా అని ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు భారత్ కు విమానాల రాకపోకలను నిషేధిస్తున్న సమయంలో ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందారు. దీంతో బీసీసీఐ పెద్దలు ఎలాంటి భయం అవసరం లేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చిన వారంలోనే ఈ కేసులు రావడంతో.. ఇప్పడు ఐపీఎల్ షెడ్యూల్ పైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories