DC vs KKR Match Preview: బ్యాటింగ్, బౌలింగ్ లో సమఉజ్జీలే.. మరి విజయం ఎవరిని వరించేనో..

IPL 2021: Delhi Capitals Vs Kolkata Knight Riders Match Preview
x

రిషభ్ పంత్ వర్సెస్ దినేష్ కార్తిక్ (ఫొటో ట్విట్టర్)

Highlights

DC vs KKR: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు రెండో మ్యాచ్‌లో కోల్‌కతాతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.

DC vs KKR: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు రెండో మ్యాచ్‌లో కోల్‌కతాతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరు జట్లకు బలమైన బ్యాటింగ్ లైనప్ తోపాటు, బౌలింగ్ టీం ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.

ఈ సీజన్‌లో ఇప్పటికే ఆరు మ్యాచ్‌లాడిన ఢిల్లీ.. 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గత మ్యాచ్‌ లో చెన్నై తో కేవలం 1 పరుగుతో ఓడిపోయింది. టాప్-4లో కొనసాగుతోంది ఢిల్లీ టీం. మరోవైపు వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఒక మ్యాచ్ గెలచింది కోల్‌కతా టీం. మరి అలానే విజయాల బాట పడుతుందో.. లేదో చూడాలి.

హెడ్ టూ హెడ్

ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. మిగిలిన 12 మ్యాచ్‌లకిగానూ 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. కోల్‌కతా టీమ్ ఇప్పటి వరకూ ఇక ఢిల్లీపై చేసిన అత్యధిక స్కోరు 210 పరుగులు. అలాగే కోల్‌కతాపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 228 పరుగులు.

టీంల బలాబలాలు

ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా అద్భుతంగా ఆడుతున్నారు. వీరిద్దరు మంచి శుభారంభాలను అందించడంతో మిడిలార్డర్ పై పెద్దగా భారం పడకుండా చేస్తున్నారు. కొన్ని మ్యాచ్‌ల్లో ఇద్దరూ తక్కువ స్కోర్లకే పరిమితవడంతో... భారమంతా కెప్టెన్న రిషభ్ పంత్ పై పడుతోంది. ఇక నెం.3లో ఆడుతున్న స్టీవ్‌స్మిత్ వరుసగా విఫలమవుతున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్, పవర్ హిట్టర్ సిమ్రాన్ హిట్‌మెయర్ గత మ్యాచ్‌లో బెంగళూరుపై హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో ఈ మ్యాచ్ లోనూ మరోసారి తమ సత్తా చూపేందుకు సిధ్దమైనట్లే. ఇక ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ మాత్రం అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.

బౌలింగ్‌లో కగిసో రబాడ, అవేష్ ఖాన్‌కి జోడీగా ఇషాంత్ శర్మ తుది జట్టులో చేరాడు. దీంతో పేస్ పరంగా ఢిల్లీ టీం బలంగా తయారైంది. మిడిల్ ఓవర్లలో అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ కూడా తమవంతు సహాయం చేస్తున్నారు.

కోల్‌కతా నైట్ రౌడర్స్

కోల్‌కతా జట్టులో ఓపెనర్లు నితీశ్ రాణా, శుభమన్ గిల్ శుభారంభం అందించడంలో వరుసగా విఫలమవుతున్నారు. దీంతో మిడిలార్డర్‌పై భారం పెరుగుతోంది. అయితే.. రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫామ్ గత మ్యాచ్‌ల్లో ఫామ్ లోకి రావడం టీంకి ఆనందంగా ఉంది. ఆండ్రీ రసెల్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇబ్బందిపడుతున్నాడు. త్వరగా పెవిలియన్ చేరి నిరాశపెడుతున్నాడు. దినేశ్ కార్తీక్, పాట్ కమిన్స్ చివర్లో మెరుపులు మెరిపిస్తున్నారు.

ఇక బౌలింగ్‌లో శివమ్ మావి, పాట్ కమిన్స్‌ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరికి తోడు ప్రసీద్ పరుగులిస్తున్నా.. వికెట్లు పడగొడుతూ.. ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. అలానే మిడిల్ ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ , రసెల్ కూడా రాణిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories