IPL 2021: వేలంలో బంగ్లాదేశ్ ప్లేయర్ పై సన్‌రైజర్స్ ఫోకస్

sunrisers Team in Ipl 2021
x

sunrisers File Photo ( The Hans India)

Highlights

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) సీజన్ 14 వేలం మరికొద్దీ రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని జట్లు అంటిపెట్టుకున్న ప్లేయర్స్ లిస్ట్...

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) సీజన్ 14 వేలం మరికొద్దీ రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని జట్లు అంటిపెట్టుకున్న ప్లేయర్స్ లిస్ట్ ప్రకటిచాయి. వార్నర్ నేతృత్వంలోని గత కొన్ని సీజన్లగా నిలకడగా రాణిస్తుంది. కాగా.. బ్యాటింగ్ లో విలియమ్స్ , వార్నర్, బ్రిస్టో, మనీష్ పాండే, విజయ్ శంకర్ లో బలంగా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ లో జట్టు బలహీనంగా కనిపింస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం 2021 వేలానికి ముందు సంజయ్ యాదవ్, ఫాబియన్ అలెన్, సందీప్ భవనాక, బిల్లీ స్టాన్లేక్, పృథ్వీరాజ్ యర్రాను రిలీజ్ చేసింది. ఆరెంజ్ ఆర్మీ దగ్గర రూ.10.75 కోట్ల పర్సు మనీ ఉంది. ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో.. సన్‌రైజర్స్ తన బలహీనతలను అధిగమించడం కోసం కొందరు కీలక ఆటగాళ్లపై కన్నేసే అవకాశం ఉంది.

ఆరెంజ్ ఆర్మీ జట్టు 2021 సీజన్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. బలహీనతలను అధిగమించడం కోసం ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లను వేలంలో చిక్కించుకోవాలని చూస్తోంది. వారిలో హిట్టర్ శివమ్ దూబే, కేదార్ దేవ్‌ధర్, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్, క్రిస్ మోరిస్, షకీబ్ అల్ హసన్ లాంటి ఆటగాళ్లపై కన్నెసిందని తెలుస్తోంది. అటు బౌలింగ్, బ్యాటింగ్ చేయగలిగిన సమర్థలను ఒడిసి పట్టకోనుంది. అంతర్జాతీయ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన షకీబ్ అల్ హసన్ తిరిగి జట్టులోకి తీసుకుంటే ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదని భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories