IPL 2020 Updates : సునాయాసంగా విజయం సాధించిన రో'హిట్' సేన!

IPL 2020 Updates : సునాయాసంగా విజయం సాధించిన రోహిట్ సేన!
x
Highlights

IPL 2020 : ఐపీఎల్ 2020 లో అతి పేలవంగా ముగిసిన మ్యాచ్ కోలకతా..ముంబాయి జట్ల మధ్య జరిగింది.

ఇప్పటివరకూ ఐపీఎల్ 2020 లో పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ఇది. మంచి బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్కతా ముంబయి ఇచ్చిన లక్ష్యాన్ని చేదించడంలో గట్టి ప్రయత్నం చేస్తుందని భావించిన అందరినీ నిరాశ పరిచిన్ మ్యాచ్ ఇది. గెలవడం మాట అటుంచి బాధ్యతగా ఆడి స్కోరు బోర్డు మీద పరుగులు చూద్దామనే ఆలోచనే లేని విధంగా కోల్కతా బ్యాట్స్ మెన్ ఆట తీరు కొనసాగింది. అటు బ్యాటింగ్ లో.. ఇటు బౌలింగ్ లో చక్కని ప్రదర్శన కనబరిచిన ముంబయి జట్టు సునాయాస విజయాన్ని అందుకోగా.. మ్యాచ్ చూస్తున్న క్రికెట్ అభిమానులకు మాత్రం నీరసం వచ్చింది. ఇక మ్యాచ్ విశేషాల్లోకి వెళితే..

ముంబయి కెప్టెన్ రోహిత్‌ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) అర్ధశతకంతో చెలరేగడంతో కోల్‌కతా జట్టుకు 196 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (47, 28 బంతుల్లో; 6×4, 1×6) రాణించాడు. సౌరభ్‌ (21, 13 బంతుల్లో; 1×4, 1×6), హార్దిక్‌ (18, 13 బంతుల్లో 2×4, 1×6) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో శివమ్‌ మావి రెండు వికెట్లు, నరైన్‌, రసెల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

196 పరుగుల చేధన కు బరిలో దిగిన కోల్కతా జట్టు ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుతుందనిపించలేదు. ఏవో కొన్ని మెరుపులు తప్ప కోల్కతా ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ ప్రయత్నాలు కనిపించలేదు.

కోల్కత జట్టు ఇన్నింగ్స్ సాగిందిలా..

* భారీ స్కోరును చేధించాల్సిన తరుణంలో బౌల్ట్‌ వేసిన మొదటి ఓవర్ లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ ఒక పరుగు కూడా చేయలేదు.

*పాటిన్సన్‌ వేసిన రెండో ఓవర్లో సునిల్‌ నరైన్‌ తొలి సిక్సర్‌ బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 8 పరుగులు వచ్చాయి.

*మూడో ఓవర్ లో మొదటి వికెట్: బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్లో గిల్‌ బంతిని లెగ్‌సైడ్‌ బౌండరీకి మళ్లించే ప్రయత్నం చేయగా పొలార్డ్‌ అద్భుతమై క్యాచ్‌ పట్టి గిల్‌ను ఔట్‌ చేశాడు. ఈ ఓవర్లో మొత్తం 10 పరుగులు వచ్చాయి.

* పాటిన్సన్‌ వేసిన 5వ ఓవర్లో కోల్‌కతా రెండో వికెట్‌ పోగొట్టుకుంది. కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి సునీల్‌ నరైన్‌(9) ఔటయ్యాడు.

* రాహుల్ చాహర్‌ బౌలింగ్‌లో మిడ్‌ఆఫ్‌ మీదుగా రాణా (7) సిక్సర్‌ బాదాడు.

* కార్తీక్‌), రాణా నిలకడగా ఆడడం తో 10 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 71/2 కు చేరింది.

* పొలార్డ్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 12 వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన రాణా హార్దిక్‌ చేతికి చిక్కాడు. బౌండరీ లైన్‌ వద్ద హార్దిక్‌ వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. 2015 తర్వాత లీగ్‌లో పొలార్డ్‌కు ఇదే తొలి వికెట్‌ కావడం విశేషం.

* బౌల్ట్‌ బౌలింగ్‌లో రసెల్‌ రెండు బౌండరీలు సాధించాడు. దీంతో 15 ఓవర్లకు కోల్‌కతా 100 పరుగులు చేసింది.

* 16 వ ఓవర్లో బుమ్రా ఒకే ఓవర్‌లో రసెల్‌ (11), మోర్గాన్‌ (16)ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో కోల్కతా కథ కంచికే అని తేలిపోయింది. 16 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 102/6.

* 18వ ఓవర్లో బుమ్రాకు కమిన్స్‌ చుక్కలు చూపించాడు. ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 27 పరుగులు వచ్చాయి. అయినా అవి విజయానికి సరిపోయేలా కనిపించలేదు.

* ఇక 19 వ ఓవర్లో ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో కమిన్స్‌ (33) భారీ షాట్‌కు యత్నించి హార్దిక్‌ చేతికి చిక్కాడు. దీంతో 19 ఓవర్లకు కోల్‌కతా 142/8 పరుగులతో అపజయాన్ని ఖాయం చేసుకుంది.

* కోల్‌కతాపై ముంబయి 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 196 పరుగుల విజయలక్ష్యంలో కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది.

కోల్‌కతా స్కోరు కార్డు

146/9 (20.0 ఓవర్లు), షుబ్మాన్ గిల్ 7 (11) సునీల్ నరైన్ 9 (10) దినేష్ కార్తీక్ 30 (23) నితీష్ రానా 24 (18) మోర్గాన్ 16 (20) రస్సెల్ 11 (11) నిఖిల్ నాయక్ 1 (3 ) పాట్ కమ్మిన్స్ 33 (12) శివం మావి 9 10 1 0 90 కుల్దీప్ యాదవ్ * అదనపు: 5 పరుగులు

Show Full Article
Print Article
Next Story
More Stories