IPL 2020 Updates: సూపర్ ఓవర్.. ఢిల్లీ సూపర్ విన్..!

IPL 2020 Updates: సూపర్ ఓవర్.. ఢిల్లీ సూపర్ విన్..!
x
Highlights

IPL 2020: రెండో మ్యాచ్ లోనె దొరికిన సిసలైన పొట్టి క్రికెట్ మజా!

ఇది కదా పొట్టి క్రికెట్ లో ఉండే మజా! దీనికోసం కదా కోట్లాది మంది టీవీల ముందు అతుక్కుపోతారు. నరాలు తెగే ఉత్కంత.. బంతి బంతికి మారుతున్నా సమీకరణాలు.. క్షణక్షణం దోబూచులాడుతున్న విజయం.. ఐపీఎల్ 2020 కి అదిరిపోయే ఆరంభం. మొదటి మ్యాచ్ లో చెన్నై కూల్ గా విజయాన్ని సాధిస్తే.. రెండో మ్యాచ్ టీ20 లలో ఉండే అసలైన మజాను చూపించింది.

టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తడబాటుతో బ్యాటింగ్ ప్రారంభించి చివరకు స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్ తో హమ్మయ్య అనుకునే స్కోరు సాధించింది. ప్రతిగా158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఇన్నింగ్స్ కూడా ఢిల్లీ ఇన్నింగ్స్ కు జెరాక్స్ లా సాగింది. మొదట్లో వరుసగా వికెట్లు కోల్పోయి.. తరువాత కోలుకుని మళ్ళీ వెనుకబడింది. ఈదశలోమయాంక్ అద్భుతమిన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. జట్టుని విజయానికి ఒక్క పరుగు ముందు వరకూ తీసుకు వెళ్ళాడు. ఈదశలో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోవడంతో స్కోరులు సమానం అయ్యాయి.

దీంతో సూపర్ ఓవర్ అవసరం అయింది. అయితే, సూపర్ ఓవర్ లో పంజాబ్ కేవలం రెండు పరుగులే చేయడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది.


ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ స్కోర్ కార్డు :

పృథ్వీ షా 5 (9) శిఖర్ ధావన్ రనౌట్ 0 (2) షిమ్రాన్ హెట్మియర్ 7 (13) శ్రేయాస్ అయ్యర్ 39( 32) రిషబ్ పంత్ 31 (29) మార్కస్ రనౌట్ 53( 21) ఆక్సర్ పటేల్ 6 (9) రవిచంద్రన్ అశ్విన్ 4 (6) కగిసో రబాడా నాటౌట్ 0 (0) అన్రిచ్ నార్ట్జే నాకౌట్ 3 (1)

కింగ్స్ XI పంజాబ్ స్కోర్ కార్డు :

కెఎల్ రాహుల్ 21 (19) మయాంక్ అగర్వాల్ 89 (60) కరుణ్ నాయర్ 1 (3) నికోలస్ పూరన్ 0 (3) గ్లెన్ మాక్స్వెల్ 1 (4) సర్ఫరాజ్ ఖాన్ 12 (12) కృష్ణప్ప గౌతమ్ 20 (14) క్రిస్ జోర్డాన్ 5 (6) మహ్మద్ షమీ నాటౌట్ 0 (0)

Show Full Article
Print Article
Next Story
More Stories