IPL 2020 Updates: కూల్ గా కొట్టేశారు! చెన్నై విక్టరీ!

IPL 2020 Updates: కూల్ గా కొట్టేశారు! చెన్నై విక్టరీ!
x
Highlights

IPL 2020 Updates : ఎక్కడా తడబాటు లేదు.. తొందరపాటు అసలే లేదు. మొదట బౌలింగ్ లో ప్రత్యర్థిని కట్టడి చేశారు. తరువాత బ్యాటింగ్ లో కూల్ గా ముందుకు సాగారు. అలా మొదటి మ్యాచ్ చెన్నై ఖాతాలో!

వరుసగా రెండు వికెట్లు.. ఒక్కసారిగా చెన్నై శిబిరానికి షాక్! బౌలింగ్ లో ముంబై దుమ్ము రేపెస్తుందని అనిపించింది. ఆ సమయంలో సమన్వయంతో ఆడారు డుప్లిసిస్..అంబటి రాయడు. దొరికినపుడు షాట్లు.. లేకపోతె.. కూల్ అలా అలా ఆడుతూ తరువాత వికెట్ పడకుండా కాపాడుకుంటూ వచ్చారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి గౌరవప్రదమైన స్కోరు సాధించి విజయం పై ఆశలను సజీవంగా ఉంచుకుంది చెన్నై.

మొదటి ఓవర్ లోనే షేన్ వాట్సన్ ఎల్బీదబ్ల్యు గా వెనుతిరిగాడు. వెంటనే రెండో ఓవర్ లో మురళీ విజయ్ అనవసరంగా తన వికెట్ సమర్పించుకున్నాడు. ఎంపైర్ తప్పుగా ఇచ్చిన ఎల్బీ కి ఏమాత్రం ఆలోచించకుండా వికెట్లు వదిలి వెళ్ళిపోయాడు విజయ్. అయితే, రీప్లే లో అది నాటౌట్ గా తేలింది.

తరువాత వచ్చిన అంబటి రాయుడు డుప్లిసిస్ తో కలిసి మెల్లగా చెన్నై ఇన్నింగ్స్ నిలబెట్టాడు. మొత్తమ్మీద పది ఓవర్లు ముగిసే సరికి చెన్నై రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. ఇక 11 వ ఓవర్ ప్రారంభం అవుతూనే రాయుడు సిక్సర్ తో విరుచుకు పడ్డాడు.. అక్కడ నుంచి రాయుడు తన స్టైల్ చూపించాడు. 12 వ ఓవర్లో అర్ధ సెంచరీ పూర్తీ చేసుకున్నాడు. వెంటనే ఓ సిక్స్ బాది ముంబై బౌలర్లకు సవాల్ విసిరాడు. రాయుడికి డుప్లిసిస్ సహాయంగా నిలవడంతో 13 వ ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. 14 వ ఓవర్లో డుప్లిసిస్..రాయుడు జంట 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది.

ఆ తరువాత కూడా ఈ ఇద్దరి జోడీ కూల్ గా ఆడింది..అయితే.. అనుకోకుండా 71 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాయుడు అవుట్ అయ్యాడు.. దాంతో చెన్నై కష్టాల్లో పడింది. రాయడు అవుట్ అయ్యే సమయానికి చెన్నై 25 బంతుల్లో 45 పరుగులు చేయాలి.

తరువాత జడేజా బ్యాటింగ్ కి వచ్చాడు.. 10 పరుగులు చేసిన జడేజా ఎల్బీగా వెనుదిరిగాడు. తరువాత బ్యాటింగ్ కి వచ్చిన కురేన్ వేగంగా ఆడాడు 6 బంతుల్లో 18 పరుగులు (రెండు సిక్స్లు) చేసి చెన్నై మీద ఉన్న ఒత్తిడి తగ్గించాడు. తరువాత ధోనీ వచ్చినా.. డుప్లిసిస్ మిగిలిన లంఛనాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ 166/5 (19.2 ఓవర్లు),

స్కోర్ కార్డు

మురళి విజయ్ 1 (7) 14.28 - షేన్ వాట్సన్ 4 (5) 80 - ఫాఫ్ డు ప్లెసిస్ * 58 (44) 131.81 - అంబటి రాయుడు 71 (48) 147.9 -రవీంద్ర జడేజా 10 (5) 200 - సామ్ కుర్రాన్ 18 (6) 300 - ఎంఎస్ ధోని * 0 (2) 0


Show Full Article
Print Article
Next Story
More Stories