IPL 2020: ఢిల్లీ కెప్టెన్ కు షాక్ .. రూ. 12 లక్షల జరిమానా

IPL 2020:  ఢిల్లీ కెప్టెన్ కు షాక్ .. రూ. 12 లక్షల జరిమానా
x

IPL 2020: ఢిల్లీ కెప్టెన్ కు షాక్ .. రూ. 12 లక్షల జరిమానా

Highlights

IPL 2020: హైద‌రాబాద్ అభిమానుల కోరిక తీరింది. వ‌రుస‌గా రెండు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల టేబుల్‌లో ఓ అట్ట‌డుగున నిలిచిన స‌న్ రైజ‌ర్స్ ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించింది. హ్యాట్రిక్ విజ‌యాలు సా

IPL 2020: హైద‌రాబాద్ అభిమానుల కోరిక తీరింది. వ‌రుస‌గా రెండు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల టేబుల్‌లో ఓ అట్ట‌డుగున నిలిచిన స‌న్ రైజ‌ర్స్ ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించింది. హ్యాట్రిక్ విజ‌యాలు సాధించాలనే ఉత్సాహంతో ఉన్న‌ఢిల్లీ ఆశ‌ల‌ను అడియాశ‌లయ్యాయి. నిన్న జ‌రిగిన‌ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుపై 15 పరుగుల తేడాతో హైద‌రాబాద్ విజయం సాధించింది. అసలే ఓట‌మి బాధ‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మరో షాక్ తగిలింది.

స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్‌కు రూ.12 లక్షల భారీ జరిమానా విధించారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ సమయంలో ఢిల్లీ జట్టు మినిమమ్ ఓవర్ రేట్‌ను మెయింటేన్ చేయపోవడంతో ఈ జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు స్లోఓవర్ రేట్ మెయిన్‌టేన్ చేయకపోతే ఈ జరిమానా విధిస్తారు. ఈ సీజన్‌లో జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇంతకుముందు బెంగళూరు కెప్టెన్ కొహ్లీకి రూ.12 లక్షల జరిమానా పడింది.

స్లో ఓవర్ రేట్ కారణంగా మొదటి సారి రూ.12 లక్షలు ఫైన్ వేశారు. రెండోసారి అదే తప్పు చేస్తే రూ.24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి చేస్తే రూ.30 లక్షల వరకు ఉంటుంది. ఇక నాలుగో సారి తప్పు చేస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఐతే తుది జట్టులో మాత్రం ఉండవచ్చు.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు ఓపెనర్లు బెయిర్ స్టో (53) హాఫ్ సెంచరీ, డేవిడ్ వార్నర్ (45), విలియమ్సన్ (41) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగుల చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులకు పరిమితమైంది. దీంతో స‌న్‌రైజ‌ర్స్ 15 పరుగుల తేడాతో ఐపీఎల్ 2020లో తమ తొలి విజయాన్ని న‌మోదుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories