ఐపీఎల్ తేదీపై వీడిన ఉత్కంఠ.. ఫైనల్ తేది విడుదల..?

ఐపీఎల్ తేదీపై వీడిన ఉత్కంఠ.. ఫైనల్ తేది విడుదల..?
x
IPL 2020
Highlights

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) సీజన్-13 నిర్వహణపై షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లే. ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్ మార్చి నెల 29 నుంచి ప్రారంభంకానుందని సమాచారం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) సీజన్-13 నిర్వహణపై షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లే. ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్ మార్చి నెల 29 నుంచి ప్రారంభంకానుందని సమాచారం. ఈ నేపథ్యంలో టోర్నీ ఫైనల్ తేదీ కూడా ప్రకటించారు. మే నెల 24న ముంబైలోని వాఖండే మైదానంలో ఫైనల్ పోరు జరగనుంది. అయితే 2019లో వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఐపీఎల్ మ్యాచ్ లు మార్చి 23 నుంచే నిర్వహించారు. అయితే తాజా ఈ సారి మ్యాచ్ మార్చి 29 నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ముంబై ఇండియాన్స్ , చైన్నె సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.

అయితే బీసీసీఐ ఐపీఎల్ 2020 సీజన్ -13 షెడ్యూల్‌ని ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సారి ఐపీఎల్ లో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో ప్రతిసారి రెండు మ్యాచ్ లో నిర్వహిస్తారు. కాగా, ఈ సారి ఒకే మ్యాచ్ నిర్వహించేలా ఎనిమిది ఫ్రాంఛైజీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయాలు కూడా సేకరించింది. ఫ్రాంచైజీలతోపాటు టెలీకాస్ట్ చేసే ఛానల్ యాజమాన్యం అనుంమతి కూడా తీసుకోనుంది. దీంతో గతంలో మాదిరి 45 రోజుల సిరీస్ కాస్త మరో 12 రోజులు పెరిగే అవకాశం ఉంది. మార్చిలో సిరీస్ మొదలైతే మే మూడో వారానికి సిరీస్ పూర్తి అవుతుంది.

ఐపీఎల్ 2019 సీజన్‌ 13లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది. అయితే దాని సొంతగడ్డపై ఫైనల్ పోరు నిర్వహించాలని ముంబై క్రికెట్ బోర్డు భావిస్తుంది. 2008లో ఐపీఏల్ తొలి సీజన్ ప్రారంభమై విజయవంతమైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు 12 సీజన్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా రౌండ్ రాబిన్ పద్ధతిలో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి జట్టు సొంతగడ్డపై ఏడు మ్యాచులు ఆడనుంది. ఐపీఎల్‌లో మొదటి టైటిల్ రాజస్థాన్ కైవసం చేసుకుంది. ముంబయి ఇండియన్స్ 4 సార్లు టైటిల్ గెలవగా.. చెన్నై సూపర్ కింగ్స్ 3, కోల్‌కతా నైట్‌రైడర్స్ 2, సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారి టైటిట్ సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ 2020 ఆటగాళ్ల వేలం తర్వాత ప్రాంఛైజీలు మార్చి 31 నుంచి ఐపీఎల్ నిర్వహించాలని కోరాయి. అన్ని జట్లతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, క్రీకెటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే వారికి మార్చి 27 వరకు పలు సిరీస్ లు ఉన్నాయి. దీంతో పూర్తి స్తాయిలో వారు ఐపీఎల్ కీ అందుబాటులో ఉండరు దీంతో ఏప్రిల్ లో వారు అందుంబాటులో ఉంటారు. దీంతో అన్ని జట్ల యాజమాన్యాలు మార్చి 31 నుంచి నిర్వహించాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories