IPL 2020: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాక్..!

ipl 2020
x
ఐపీఎల్
Highlights

ఐపీఎల్ (2020)13వ సీజన్‌ మొదలు కాకముందే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలింది. మరో మూడు వారాల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది.

ఐపీఎల్ (2020)13వ సీజన్‌ మొదలు కాకముందే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలింది. మరో మూడు వారాల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. టోర్నీ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని కుదించింది. ప్రైజ్ మనీ సగం తగ్గించడంపై వివరించింది. ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కింది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది.

ఐపీఎల్‌లో భారీ ఖర్చులు ఆదాలో భాగంగా క్యాష్ రివార్డ్స్‌‌ను తగ్గించాం. ఈ సీజన్ -13లో ఐపీఎల్ విన్నర్ జట్టు రూ.10కోట్ల ప్రైజ్‌మనీ మాత్రమే గెలుచోనుంది. అయితే గత ఐపీఎల్ ల్లో చాంపియన్ జట్టుకు రూ.20కోట్లుగా ఉండేది. అలాగే రన్నరప్‌కు రూ.6.25కోట్లు మాత్రమే అందుకోనుంది. గతంలో రూ.12.5కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చింది. ఇక మూడో స్థానం, నాలుగు స్థానాల్లో నిలిచే రూ.4. 3కోట్ల చొప్పున ఇవ్వనున్నారు.

అయితే ఫ్రాంచైజీలు మంచి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. ఫ్రాంచైజీల ఆదాయాన్ని పెంచడం కోసం స్పాన్సర్‌షిప్ లాంటి మార్గాలు ఉన్నాయని తెలిపారు. అందుకే ప్రైజ్ మనీపై తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నామని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు. మార్చి 29 నుంచి ఐపీఏల్ ప్రారంభంకానుంది. మే24న ముగియనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories