IPL 2020: ధోనీపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి ఫైర్‌

IPL 2020: ధోనీపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి  ఫైర్‌
x
Highlights

IPL 2020: యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన వ్యాఖ్యల పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించారు

IPL 2020: యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన వ్యాఖ్యల పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించారు. కేదార్ జాదవ్, పియూష్ చావ్లా లాంటి ఆటగాళ్లను తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారని విమర్శించారు. రాజస్థాన్‌తో ఓటమి అనంతరం ఎం ఎస్ ధోనీ మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించనందునే.. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో వారికి అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. ఒత్తిడి తక్కువగా ఉన్న‌పుడే యువ ఆటగాళ్లు బాగా రాణిస్తారని మహీ చెప్పుకొచ్చాడు. ధోనీ వ్యాఖ్యల పట్ల శ్రీకాంత్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''ధోనీ గొప్ప ఆటగాడు. దానిలో ఎలాంటి సందేహం లేదు. ప్రాసెస్‌ను నమ్ముతానని ధోనీ చెబుతున్న మాటలను నేను అంగీకరించను. ధోనీ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ టీమ్ సెలక్షన్ విధానమే తప్పు' అని వ్యాఖ్యానించారు. కేదార్ జాదవ్, పియూష్ చావ్లాలకు తుది జట్టులో చోటు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కేదార్ జాదవ్ ఈ ఐపీఎల్ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 62 పరుగులు చేశాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 24 ఏళ్ల జగదీషన్‌కు అవకాశం ఇస్తే 28 బంతుల్లో 33 రన్స్ చేశాడు. మరి అలాంటప్పుడు యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదని ధోనీ ఎలా చెబుతాడని శ్రీకాంత్ ప్రశ్నించారు. ''జగదీషన్ లాంటి యువ ఆటగాళ్లలో స్పార్క్ లేదని నువ్వు చెబుతున్నావ్. మరి కేదార్ జాదవ్‌లో స్పార్క్ ఉందా..? పియూష్ చావ్లాలో స్పార్క్ చూపించాడా..? ధోనీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ధోనీ మాటల‌ను అంగీక‌రించ‌నని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories