IPL 2020 Match 15 Updates : రాజస్థాన్ పై బెంగళూరు ఘన విజయం!

IPL 2020 Match 15 Updates : రాజస్థాన్ పై బెంగళూరు ఘన విజయం!
x
Highlights

IPL 2020 Match 15 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2020 టోర్నీలో 15వ మ్యాచ్ లో బెంగళూరు జట్టు సునాయాసంగా విజయం సాధించింది.

కోహ్లీ సేనకు అతి సులువైన విజయం ఇది. టాస్ ఓడిపోయి ఫీల్డింగ్ కి దిగిన బెంగళూరు మొదట బౌలింగ్ లో ప్రత్యర్థిని కట్టడి చేసింది. తరువాత రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించింది. పడిక్కల్..విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో రాజస్థాన్ తమ ముందుంచిన లక్ష్యం 155 పరుగులని అవలీలగా చేధించి ఈ టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు ఇన్నింగ్స్ లో పదిక్కర్ ఆది నుంచి బ్యాట్ కు పనిచేప్పాడు రెండో ఓవర్లోనే ఒక సిక్స్.. ఒక బౌండరీ..రెండు డబుల్స్ చేసి రాజస్థాన్ బౌలరాల్ మీద విరుచుకు పడ్డాడు. తర్వాత పరిస్థితులకు అనుగుణంగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకుంటూ.. చెత్త బంతులను ఓ ఆట ఆడి రెచ్చిపోయాడు. తరువాత అతనికి కోహ్లీ జత కలిశాడు టోర్నీలో తొలిసారి ఫాం లోకి వచ్చిన కోహ్లీ ఒక పక్క రెచ్చిపోతే.. మరో పక్క కెప్టెన్ కు అండగా పడిక్కల్ కూడా బ్యాట్ ఝుళిపించాడు దీంతో ఎక్కడా బెంగళూరు తడబడకుండా విజయాన్ని సాధించింది.

బెంగళూరు బ్యాటింగ్ సాగిందిలా..

* జయదేవ్‌ ఉనద్కత్‌ వేసిన రెండో ఓవర్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్(16)‌ రెచ్చిపోయాడు. తొలి రెండు బంతులను ఒక సిక్స్‌, ఒక ఫోర్‌గా మలిచిన అతడు తర్వాత రెండు డబుల్స్‌ , ఒక సింగిల్‌ తీశాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి.

* శ్రేయస్‌ గోపాల్‌ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఆరోన్‌ ఫించ్‌(8) ఔటయ్యాడు. దీంతో బెంగళూరు 25 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

* నిదానంగా కుదురుకున్న కోహ్లీ శ్రేయస్‌ గోపాల్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి ఈ సీజన్‌లో తొలి బౌండరీ బాదాడు. మరో పక్క పడిక్కల్‌ ధాటిగా ఆడుటంతో 5 ఓవర్లకు బెంగళూరు స్కోర్‌ 39/1గా నమోదైంది.

* ఒక పక్క కోహ్లీ సహకరిస్తుంటే పడిక్కల్ దూకడుగా ఆడుటూ టామ్‌ కరన్‌ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు సాధించాడు. ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు బెంగళూరు 50/1

* శ్రేయస్ గోపాల్‌..తేవాతియా బౌలింగ్‌లో కోహ్లీ, పడిక్కల్‌ ఆచితూచి ఆడారు. దీంతో 10 ఓవర్లకు బెంగళూరు 77/1 చేసింది.

* ఇన్నింగ్స్ 12 వ ఓవర్లో పడిక్కల్ అర్ధశతకం సాధించాడు. ఉనద్కత్‌ బౌలింగ్‌లో బౌండరీ సాధించి హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. ఈ లీగ్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతడు మూడు అర్ధశతకాలు బాదడం విశేషం. మొత్తమ్మీద 12 ఓవర్లకు బెంగళూరు 91/1 పరుగులు చేసింది.

* కోహ్లీ దూకుడు పెంచడంతో రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోర్‌, సిక్సర్‌ బాదాడు. 3 ఓవర్లకు బెంగళూరు 104/1

* తెవాతియా వేసిన ఇన్నింగ్స్ 15 వ ఓవర్లో సింగిల్‌ తీసి కోహ్లీ 41 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. 15 ఓవర్లకు బెంగళూరు 118/1

* చక్కగా ఆడుతున్న పడిక్కల్‌ (63)ను ఆర్చర్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 99 పరుగుల కోహ్లీ-పడిక్కల్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 16 ఓవర్లలో బెంగళూరు 124/2.

* ఇన్నింగ్స్ 18 వ ఓవర్లో.. టామ్‌ కరన్‌ బౌలింగ్‌లో కోహ్లీ ముచ్చటైన షాట్లతో మూడు బౌండరీలు సాధించాడు. దీంతో ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.18 ఓవర్లకు బెంగళూరు 147/2.

* రాజస్థాన్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ కోహ్లీ(72 నాటౌట్‌) అర్ధశతకంతో మెరిశాడు. చివర్లో డివిలియర్స్‌(12) పరుగులతో రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌.. టాపార్డర్‌ ఆటగాళ్లైన స్టీవ్‌ స్మిత్‌(5), జోస్‌ బట్లర్‌(22), సంజూ శాంసన్‌(4) వికెట్లను ఐదు ఓవర్లలోపే కోల్పోయింది. ఇసుర ఉదాన వేసిన మూడో ఓవర్‌ నాల్గో బంతికి స్మిత్‌ బౌల్డ్‌ కాగా, కాసేపటికి సైనీ బౌలింగ్‌లో బట్లర్‌ పెవిలియన్‌ చేరాడు. దేవదూత్‌ పడిక్కల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో బట్లర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక సంజూ శాంసన్‌ కూడా విఫలయ్యాడు. దాంతో 31 పరుగులకే రాజస్తాన్‌ మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై రాబిన్‌ ఊతప్ప-లామ్రోర్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కానీ ఊతప్ప(17) నాల్గో వికెట్‌గా ఔట్‌ కావడంతో రాజస్తాన్‌ను లామ్రోర్‌ ఆదుకున్నాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా లామ్రోర్‌ మాత్రం నిలకడగా ఆడాడు. 39 బంతుల్లో 1 ఫోర్‌, 3సిక్స్‌లతో 47 పరుగులు సాధించి రాజస్తాన్‌ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇది లామ్రోర్‌కు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌. చివర్లో ఆర్చర్‌(16 నాటౌట్‌; 10 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్స్‌)), రాహుల్‌ తెవాటియా(24 నాటౌట్‌; 12 బంతుల్లో 3 సిక్స్‌లు)లు బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ మూడు వికెట్లు సాధించగా, ఉదాన రెండు వికెట్లు తీశాడు. సైనీకి వికెట్‌ దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories