logo
క్రీడలు

IPL 2020: ముంబాయి భారీ విజ‌యం.. అన్నింటా విఫ‌ల‌మైన పంజాబ్

IPL 2020: ముంబాయి భారీ విజ‌యం..  అన్నింటా విఫ‌ల‌మైన పంజాబ్
X

IPL 2020: ముంబాయి భారీ విజ‌యం.. అన్నింటా విఫ‌ల‌మైన పంజాబ్

Highlights

IPL 2020: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13 వ సీజ‌న్‌లో టాస్ గెలిస్తే మ్యాచ్ ఓడిపోతార‌నుకుంటా. ఈ సీజ‌న్‌లో దాదాపు అన్ని మ్యాచ్‌ల‌లో ఇదే జ‌రుగుతున్న‌ది. టాస్ ఓడిన ముంబ‌యి జ‌ట్టు పంజాబ్‌పై భారీ విజ‌యం సాధించింది. క

IPL 2020: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13 వ సీజ‌న్‌లో టాస్ గెలిస్తే మ్యాచ్ ఓడిపోతార‌నుకుంటా. ఈ సీజ‌న్‌లో దాదాపు అన్ని మ్యాచ్‌ల‌లో ఇదే జ‌రుగుతున్న‌ది. టాస్ ఓడిన ముంబ‌యి జ‌ట్టు పంజాబ్‌పై భారీ విజ‌యం సాధించింది. క‌నీసం 150 ప‌రుగులైనా దాటుతుందా అనుకున్న సంద‌ర్భంలో రోహిత్ అర్థసెంచ‌రీ కి పోలార్డ్, పాండ్యా మెరుపులు తోడు కావ‌డంతో 191 ప‌రుగుల భారీ ల‌క్ష్యం పంజాబ్ ముంగింట ఉంచింది. లక్ష్య ఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. టాప్ అర్డ‌ర్ తో పాటు , మిడిల్ అర్డ‌ర్ కూడా విఫ‌ల‌మైంది. దీంతో ‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబాయి 48 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ముంబై పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవ‌ర్ లోనే ఓపెనర్‌ క్వింటన్ డికాక్ ‌(0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంత‌రం నాలుగో ఓవర్‌లో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్ గా వ‌చ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (10) అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దీంతో ముంబై 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ త‌రువాత వ‌చ్చిన ఇషాన్ కిష‌న్‌తో రోహిత్ శ‌ర్మ జోడీ కట్టి.. వికెట్ ప‌డ‌కుండా నెమ్మ‌దిగా ఆడుకుంటు వ‌చ్చారు. కానీ కృష్ణ‌ప్ప గౌత‌మ్ వేసిన 14 వ ఓవ‌ర్‌లో ఇషాన్‌ కిషన్ తొలి బంతికి భారీ షాట్ కొట్టాడానికి ప్ర‌య‌త్నించి.. బౌండరీ వద్ద కరున్‌ నాయర్‌ చేతికి చిక్కాడు. దీంతో 62 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

16 ఓవ‌ర్ త‌రువాత రెచ్చిపోయిన రోహిత్‌ శర్మ .. ఆ ఓవ‌ర్‌లో 21 పరుగులు సాధించడంతో పాటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే షమీ వేసిన తర్వాతి ఓవర్‌లో మరో భారీ హిట్టింగ్ కు ప్ర‌యత్నించి.. ఔట్ అయ్యారు. దీంతో ముంబయి 124 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. అనంత‌రం మైదానంలోకి అడుగుపెట్టిన హార్థిక్ పాండ్యా.. హార్డ్ హిట్ పాండ్యా గా మారాడు.. కేవ‌లం 11 బంతుల్లో 30 ప‌రుగు చేశాడు. ఈ క్ర‌మంలో పోలార్డు కూడా వీర విహారం చేశాడు. 19వ ఓవర్లో కీరన్ పొలార్డ్‌ మూడు వరుస బౌండరీలు ఆ త‌రువాత గౌతం వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో ఆఖరి మూడు బంతుల్లో పొలార్డ్‌ వరుసగా సిక్సర్లు బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

ఓపెనింగ్ ఇన్నింగ్ బాగున్నా..

191 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌తో భారీలోకి దిగిన పంజాబ్ . ఓపెన‌ర్లు మ‌యాంక్ , పూర‌న్‌లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఈ క్రమంలో ఐదో ఓవర్‌ ఐదో బంతికే బుమ్రా బౌలింగ్‌లో మ‌యాంక్ (25)‌ బౌల్డ్‌ అయ్యాడు. పంజాబ్ బ్యాట్స్‌మన్‌లలో నికోలస్ పూరన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సుల‌తో 44 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రూ త‌ప్ప‌ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఆ తర్వాతి ఓవర్‌లోనే కరుణ్‌ నాయర్‌ (0) కూడా కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కాసేపటికే కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ (17)‌ ఔటవడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ బౌల్డ్‌ కావడం విశేషం.

టాప్ హిట్ట‌ర్ పెవిలియ‌న్ కు వెళ్ల‌డంతో మ్యాచ్‌పై ముంబై బౌలర్లు ప‌ట్టుబిగించారు. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నికోలస్ పూరన్‌ ఒక్కడే ఫోర్లు, సిక్సర్లతో కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అలాగే చాలా సేపు క్రీజులో ఉన్న మాక్స్‌వెల్ స‌రిగా ఆడ‌లేక‌పోయాడు .18 బంతులాడి కేవలం 11 రన్స్‌ మాత్రమే చేసి నిరాశపరిచాడు. గౌతమ్ ‌(22 నాటౌట్‌; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో బ్యాట్‌ ఝుళిపించాడు. దాంతో పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (2/18), రాహుల్‌ చహర్‌ (2/26), జేమ్స్‌ పాటిన్సన్‌ (2/28) తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Web TitleIPL 2020: Kings XI Punjab vs Mumbai Indians: Rohit's class, Pollard and Hardik's power give MI 48-run win
Next Story