IPL 2020: చెన్నై, ఢిల్లీల‌ వార్ నేడే

IPL 2020: చెన్నై, ఢిల్లీల‌ వార్ నేడే
x

 CHENNAI VS DELHI

Highlights

IPL 2020: నేడు ఐపీఎల్ లో మ‌రో ఉత్కంఠ పోరు జ‌రుగునున్న‌ది. దుబాయి వేదిక‌గా సూపర్‌కింగ్స్‌తో ఢిల్లి క్యాపి టల్స్ తలపడనుంది. తొలి మ్యాచ్ లోనే సూప‌ర్ విక్ట‌రీని అందుకుని ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ కు సిద్ధమైంది

IPL 2020: నేడు ఐపీఎల్ లో మ‌రో ఉత్కంఠ పోరు జ‌రుగునున్న‌ది. దుబాయి వేదిక‌గా సూపర్‌కింగ్స్‌తో ఢిల్లి క్యాపి టల్స్ తలపడనుంది. తొలి మ్యాచ్ లోనే సూప‌ర్ విక్ట‌రీని అందుకుని ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ కు సిద్ధమైంది. మ‌రో వైపు తొలుత ముంబ‌యితో జ‌రిగిన మ్యాచ్ లో గెలుపొందినా ‌.. ఆ త‌రువాత‌ రాజస్థాన్ చేతిలో చెన్నైకి ఓటమి పాలైంది. దీంతో ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రాజస్థాన్‌పై గెలవడం ద్వారా విమర్శకులకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ధోనీ ఉన్నాడు.

బ్యాటింగ్, బౌలింగ్ ల్లో చెన్నై చాలా 'సూప‌ర్'‌గా ఉంది. ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచుల్లోనూ డుప్లెసిస్ మాత్రమే నిలకడగా బ్యాటింగ్‌ చేసారు. తొలి మ్యాచ్‌లో రాణించిన రాయుడిని రెండో మ్యాచ్‌కు దూరంగా ఉంచారు. ఈ మ్యాచ్ లో రాయుడును ఆడిస్తారా లేదా అనేది తేలియలేదు. ఇక, ఓపెనర్లు మురళీ విజయ్, షేన్ వాట్సన్‌లు భారీ స్కోర్లను సాధించలేక పోతున్నారు. ఈసారైన వీరిద్దరూ మెరుగైన ఆట తీరు కనబరిస్తే.. చెన్నై గెలుపు ఖాయం.

ఇక ధోని విష‌యానికి వ‌స్తే.. పంజాబ్ మ్యాచ్‌లో చివ‌రిస్థానంలో బ్యాటింగ్ వ‌చ్చినా.. ల‌క్ష్య ఛేద‌న‌లో విఫ‌లమ‌య్యాడు. కానీ చివ‌రి ఓవ‌ర్ త‌నదైన స్టైల్‌లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టి.. తాను ఫాంలోకి వచ్చాన‌ని ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను హెచ్చ‌రించారు. ఇక, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శామ్ కరన్ తదితరులు కూడా మెరుగైన ఆట తీరును క‌న‌బ‌రుస్తార‌ని చెన్నై యాజ‌మాన్యం ఆశిస్తున్న‌ది.

ఇక తొలి మ్యాచ్‌లో సూప‌ర్ ఓవ‌ర్‌తో విజయం సాధించిన ఢిల్లీ.. రెండో గెలుపుపై కన్నేసింది. ఈసారి కూడా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని మరింత దూసుకెళ్లాల‌ని భావిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే తొలి మ్యాచ్‌లో ధావన్, పృథ్వీషాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు కూడా స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యారు. చివర్లో స్టోయినిస్ మెరుపులు మెరిపించడం వల్లే ఢిల్లీ మెరుగైన స్కోరును సాధించగలిగింది. ఈసారైన బ్యాట్స్‌మెన్ తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. సమష్టిగా రాణిస్తే చెన్నైను ఓడించడం ఢిల్లీకి అసాధ్యమేమి కాదు.

ఢిల్లి క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ఆధ్వర్యంలో రాటుతేలుతోంది. ఒత్తిడిలో ప్రత్యర్థిని ఎలా చిత్తు చేయాలో తెలుసు కుంది. ఈ అంశం ఢిల్లికి కలిసొచ్చే అంశంగ చెప్పొచ్చు. తొలి మ్యాచ్‌లో గాయపడిన అశ్విన్‌కు తుదిజట్టులో చోటు దక్కితే ఢిల్లికి అదనపు బలం చేకూరినట్లే ..యూఏఈ పిచ్‌లు క్రమంగా స్పిన్నర్లుకు అనుకూలంగా మారిపోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories