IPL 2020: రాజ‌స్థాన్ బౌల‌ర్ల ధాటికి.. త‌డ‌బ‌డ్డ చెన్నై బ్యాట్స్ మెన్స్

IPL 2020: రాజ‌స్థాన్ బౌల‌ర్ల ధాటికి.. త‌డ‌బ‌డ్డ చెన్నై బ్యాట్స్ మెన్స్
x

IPL 2020: రాజ‌స్థాన్ బౌల‌ర్ల ధాటికి.. త‌డ‌బ‌డ్డ చెన్నై బ్యాట్స్ మెన్స్

Highlights

IPL 2020: ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ భాగంగా అబుధాబి వేదిక‌గా జ‌రుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ చాలా తక్కువ స్కోరు చేసింది.

IPL 2020: ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ భాగంగా అబుధాబి వేదిక‌గా జ‌రుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ చాలా తక్కువ స్కోరు చేసింది. ఆరంభం నుంచి చెన్నై జట్టు దూకుడుగా ఆడలేకపోయింది. హిట్టర్లంతా వరుస పెట్టి పెవిలియన్‌కు క్యూ కట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై5 వికెట్ల న‌ష్టానికి 125 పరుగులను మాత్రమే చేయగలిగింది.

మ్యాచ్‌లో చెన్నై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. రాజస్థాన్ బౌలర్లు చెన్నైపై ఆరంభం నుంచి ఒత్తిడి పెంచారు. ఏ దశలోనూ చెన్నై బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వలేదు. కేవలం జడేజా మాత్రమే జట్టును ఆదుకునే యత్నం చేశాడు. 30 బంతులు ఆడిన జడేజా 4 ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫామ్‌లో లేక తడబడుతున్న కెప్టెన్‌ ధోనీ టచ్‌లోకి వచ్చినట్లు కనపడినా అంతలోనే రనౌట్‌ అయ్యాడు.

డుప్లెసిస్‌(10), వాట్సన్‌(8), అంబటి రాయుడు((13)లు తీవ్రంగా నిరాశపరచగా, సామ్‌ కరాన్‌(22) ఫర్వాలేదనిపించాడు. ఇక రవీంద్ర జడేజా(35 నాటౌట్‌; 30 బంతుల్లో 4 ఫోర్లు), ధోని(28; 28 బంతుల్లో 2 ఫోర్లు)లు మరమ్మత్తులు చేయడంతో 120 పరుగు మార్కును చేరింది. 56 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ధోని-జడేజాలు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే యత్నం చేశారు. ఎక్కువగా స్టైక్‌రొటేట్‌ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాయల్స్ బౌలర్లలో ఆర్చర్‌, కార్తీక్ త్యాగి, ఎస్‌.గోపాల్‌, ఆర్‌.తెవాతియాలకు తలా 1 వికెట్ దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories