ఐపీఎల్ వేలం : రెండో సెషన్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే

ఐపీఎల్ వేలం : రెండో సెషన్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
x
Ipl 2020 Auction
Highlights

ఐపీఎల్‌ సీజన్‌-13కి గురువారం వేలం జరుగుతోంది. రెండో సెషన్ ముగిసింది. మొత్తం 62 మంది ఆటగాళ్లను ఫ్రాచైంజీలు కొనుగోలు చేశాయి. ఈ వేలంలో స్వదేశీ...

ఐపీఎల్‌ సీజన్‌-13కి గురువారం వేలం జరుగుతోంది. రెండో సెషన్ ముగిసింది. మొత్తం 62 మంది ఆటగాళ్లను ఫ్రాచైంజీలు కొనుగోలు చేశాయి. ఈ వేలంలో స్వదేశీ క్రికెటర్లు ఎక్కువ ధర పలుకుతున్నారు. తొలి సెషన్‌లో భారత క్రికెటర్ల విషయానికి వస్తే యూసఫ్ పఠాన్,చతేశ్వర పుజారా, స్టువర్ట్‌ బిన్నీను కోనుగోలు చేయలేదు. అయితే కొందరు యువ ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. సౌరభ్ తివారీ, డేనియల్ సామ్, పవన్ దేశ్ పాండే, కేదార్ దేవధర్, ప్రభుస్రిమ్రన్ సింగ్, షారుఖ్ ఖాన్, విశాఖ కుర్రాడు కేఎస్ భరత్‌కు నిరాశ మిగిలింది. విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే విండీస్ ఆటగాళ్లు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ హెట్‌మైయిర్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను లక్కీ ఛాన్స్ కొట్టారు. అలాగే ఈ వేలం పాటలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల వైపు ఫ్రాంచైజీలు మొగ్గు చూపాయి. ఆస్టేలియాన్ ఆల్ రౌండర్ ప్యాట్‌ కమిన్స్‌,ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్ అత్యధిక ధర పెట్టి ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.

*ఫాబియన్ అలెన్‌ను రూ.50లక్షలకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.

* విండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

* ఇంగ్లాండ్ క్రికెటర్ జోర్డాన్ రూ. 3 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకుంది.

* ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ రూ.4 కోట్లకు బెంగళూరు సొంతం చేసుకుంది.

* ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మార్కస్ స్టోయిన్ ఢిల్లీ క్యాపిటన్స్ రూ.4.8 కోట్లకు కొనుగోలు చేసింది.

* సౌతాఫ్రికా ప్లేయర్ డెయిల్ స్టేయిన్ బెంగళూరు రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. మొదటి సారి స్టేయిన్ అమ్ముడుపోలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories