IPL 2020: ఐపీఎల్‌లో తొలి అమెరికన్‌ క్రికెటర్‌

IPL 2020: ఐపీఎల్‌లో తొలి అమెరికన్‌ క్రికెటర్‌
x

American cricketer

Highlights

IPL 2020: ఐపీఎల్ లో తొలిసారిగా అమెరికన్ క్రికెటర్ ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున అమెరికాకు చెందిన పేసర్ అలీ ఖాన్ ఆడనున్నట్లు స‌మాచారం.

IPL 2020: ఐపీఎల్ లో తొలిసారిగా అమెరికన్ క్రికెటర్ ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున అమెరికాకు చెందిన పేసర్ అలీ ఖాన్ ఆడనున్నట్లు స‌మాచారం. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఓ అమెరికన్ క్రికెటర్ ఆడడం ఇదే తొలిసారి. దీంతో ఐపీఎల్‌లో ఆడనున్న తొలి ఆటగాడిగా 29ఏండ్ల ఖాన్‌ అరుదైన ఘనత అందుకోనున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్ పేసర్ హ్యారీ గార్నీ భుజం గాయంతో ఇటీవల ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్నాడు. ఈ నెలలోనే గార్నీ భుజాని సర్జరీ జరగాల్సిన ఉండడంతో.. మెగా ఈవెంట్ నుంచి వైదొలిగాడు. హ్యారీ గార్నీ స్థానాన్ని కేకేఆర్ యాజమాన్యం అలీ ఖాన్‌తో పూడ్చింది.

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) 2020 విజేతగా నిలిచిన ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టుకు అలీ ఖాన్‌ ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల ముగిసిన సీపీఎల్‌లో ఉత్తమ బౌలర్లలో ఒకడిగా అతడు నిలిచాడు. 7.43 ఎకానమీ రేటుతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. దినేశ్‌ కార్తీక్‌ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ ఫ్రాంఛైజీ సహయజమానిగా బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ వ్యవహరిస్తున్నారు.

2018 గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో అలీ ఖాన్ ఆడాడు. ఆ లీగ్‌లో విండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో దృష్టిని ఆకర్షించాడు. దీంతో సీపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. 2018లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడిన అలీ ఖాన్.. 12 మ్యాచ్లలో 16 వికెట్లు పడగొట్టాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories