IPL 2020: దంచి కొట్టిన హైదరాబాద్ ఓపెనర్లు.. పంజాబ్ విజయలక్ష్యం 202

IPL 2020: దంచి కొట్టిన హైదరాబాద్ ఓపెనర్లు.. పంజాబ్ విజయలక్ష్యం 202
x
Highlights

IPL 2020 Match 22 Updates: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు విరుచుకుపడటంతో పంజాబ్ ముందు భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది.

వార్నర్ విరుచుకు పడిన వేళ.. తోడుగా బెయిర్‌ స్టో రెచ్చిపోతే అక్కడ విధ్వంసమే! ఆ విధ్వంసానికి వేదిక అయింది దుబాయ్ క్రికెట్ స్టేడియం. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. తరువాత ఒక ఎండ్ లో బెయిర్‌ స్టో రెచ్చిపోతుంటే.. మరో ఎండ్ లో పంజాబ్ పై తన రికార్డును పదిలంగా కాపాడుకుంటూ వార్నర్ దంచి కొట్టాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.

వార్నర్ రికార్డ్ హాఫ్ సెంచరి..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. కింగ్స్‌ పంజాబ్‌ తొ మ్యాచ్ అంటేనే పరుగుల వరద పారిస్తాడు. ఇప్పుడు దుబాయ్ లోనూ అదే చేశాడు. ఈ మ్యాచ్ లో వార్నర్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం సాధించాడు. ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌పై వరుసగా తొమ్మిదో హాఫ్‌ సెంచరీ సాధించినట్లయ్యింది. ఐపీఎల్‌లో ఒక ప్రత్యర్థిపై ఇలా తొమ్మిది హాఫ్‌ సెంచరీలు వరుసగా సాధించడం వార్నర్‌కు పంజాబ్‌పైనే అత్యధికం కావడం విశేషం. 2015 నుంచి 2020 మధ్య కాలంలో పంజాబ్‌పై ఆడిన ప్రతీసారి వార్నర్‌ హాఫ్‌ సెంచరీ సాధిస్తూ వస్తున్నాడు. ఇక ఆర్సీబీపై వరుసగా 7హాఫ్‌ సెంచరీలను వార్నర్‌ సాధించగా, సీఎస్‌కేపై వరుసగా 5 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.

హైదరాబాద్ బ్యాటింగ్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లను ఆదేసుకుని ఆరేసుకున్నారు. ఈ క్రమంలో ముందుగా బెయిర్‌ స్టో హాఫ్‌ సెంచరీ సాధించాడు. తరువాత కాసేపటికి వార్నర్‌ అర్థ శతకం బదేశాడు. వార్నర్‌ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌తో 52 పరుగులు చేసిన తర్వాత తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో హైదరాబాద్ 160 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.ఆపై వెంటనే బెయిర్‌ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఔటయ్యాడు. ఇక తరువాత హైదరాబాద్ కత మారిపోయింది. వీరిద్దరూ అవుట్ అయినా హైదరాబాద్ కచ్చితంగా 220 పరుగులన్నా చేస్తుందని అభిమానులు అంచనావేశారు. అయ్తీ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ క్యూ కట్టారు. మొదట 160 పరుగుల వద్దే ఎస్‌ఆర్‌హెచ్‌ మరో వికెట్‌ను కోల్పోగా, మరో పరుగు వ్యవధిలో మనీష్‌ పాండే(1) వికెట్‌ను నష్టపోయింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పాండే నిష్క్రమించాడు. దీంతో హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఎప్పటిలానే ఉందని తేలిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories