IND vs BAN: నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. దుబాయ్ లో వాతావరణం ఎలా ఉందంటే ?

IND vs BAN: నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. దుబాయ్ లో వాతావరణం ఎలా ఉందంటే ?
x
Highlights

IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరుగుతుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌తో టీమ్ ఇండియా ఈ టోర్నమెంట్‌లో తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది.

IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరుగుతుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌తో టీమ్ ఇండియా ఈ టోర్నమెంట్‌లో తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ కోసం భారీ ప్రణాళికలను రెడీ చేసుకున్నాడు. దుబాయ్‌లోని పొడి వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని జట్టులో ఐదుగురు స్పిన్నర్లను చేర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కనీసం ముగ్గురు స్పిన్నర్లను ఫీల్డింగ్ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ మ్యాచ్ కు ముందు వాతావరణం టీం ఇండియాకు విలన్ గా మారుతున్నట్లు కనిపిస్తోంది. దుబాయ్ లో వాతావరణంగా మేఘావృతంగా ఉంటుందని భావిస్తున్నారు.దీంతో రోహిత్ శర్మ స్పిన్ ప్లాన్ కాస్త దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.

దుబాయ్‌లో వర్షం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ ఫిబ్రవరి 18న వర్షం పడింది. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌ను ప్రభావితం చేస్తుంది. మ్యాచ్‌లో ఇది మళ్ళీ జరిగే అవకాశం చాలా తక్కువ. కానీ ఈ మ్యాచ్ సమయంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు ఉండే పరిస్థితులకు అవకాశం ఉంది. ఇదే జరిగితే టీం ఇండియాకు సమస్యలు తలెత్తవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్‌లోకి కేవలం ముగ్గురు మెయిన్ పేసర్లతోనే అడుగుపెట్టాడు అతను ఐదుగురు స్పిన్నర్లకు ఈ మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చాడు.

మేఘావృతమైన పరిస్థితుల్లో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. దీని అర్థం ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దించడం మంచిది. కానీ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు మెయిన్ పేసర్లను రంగంలోకి దించాలని భారత్ ఆలోచిస్తోంది. ఇది కాకుండా జట్టులో ఉన్న మహ్మద్ షమీ ఇంకా మంచి ఫామ్ లో కనిపించడం లేదు. కాగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు పెద్దగా అనుభవం లేదు. హార్దిక్ పాండ్యా జట్టులో నాల్గవ పేసర్ కాకపోతే తను ఆల్ రౌండర్.

మరోవైపు బంగ్లాదేశ్ జట్టు నలుగురు పేసర్లతో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో నహిద్ రాణా వంటి బ్లాస్టర్ బౌలర్ కూడా ఉన్నాడు. తను గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. అలాగే ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్ లతో పాటు తంజిమ్ హసన్ సాకిబ్ వంటి మెయిన్ బౌలర్లు కూడా ఉన్నారు. ఈ నలుగురు బౌలర్లు గతంలో టీం ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. మ్యాచ్ కు ఒక రోజు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో వాతావరణం, ఫాస్ట్ బౌలర్ల గురించి అతన్ని ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా ఆయన వాతావరణాన్ని మనం ఏం చేయలేమన్నారు. ఇది జరిగితే దానిని ఎదుర్కోగల ప్లాన్లు మా దగ్గర ఉన్నాయన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories