వెస్టిండీస్ పర్యటనలో సత్తాచాటిన టీమిండియా

Indian win by West Indies last T20
x

వెస్టిండీస్ పర్యటనలో సత్తాచాటిన టీమిండియా

Highlights

India vs West Indies 5th T20: వన్డే సిరీస్, టీ20 సిరీస్‌ టీమిండియా కైవసం

India vs West Indies 5th T20: వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా సత్తాచాటింది. వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా మ్యాచ్‌ను చేజిక్కింకుంది. వెస్టిండీస్ పర్యటనలో అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 7 వికెట్లను కోల్పోయి 188 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్‌ 40 బంతుల్లో 8 బౌండరీలు, రెండు సిక్సర్లతో 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.

దీపక్ హుడా 38 పరుగులు, హార్థిక్ పాండ్యా 28 పరుగులు అందించారు. 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వందపరుగులకే ఆలౌటయ్యారు. రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు, అక్షర్ పటేల్ మూడు వికెట్లు, కులదీప్ యాదవ్ మూడు వికెట్లు తీశారు. ఓవరాల్‌గా ఐదు టీ20ల సిరీస్‌లో బౌలర్ అర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఆఖరు మ్యాచులో వెస్టిండీస్‌ దూకుడుకు కళ్లెంవేసి కీలక వికెట్లను పడగొట్టిన అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories