భారత వెయిట్‌లిఫ్టర్ సర్బ్‌జీత్ కౌర్‌కు షాక్.. నాలుగేళ్లు నిషేధం

భారత వెయిట్‌లిఫ్టర్ సర్బ్‌జీత్ కౌర్‌కు షాక్.. నాలుగేళ్లు నిషేధం
x
sarbjeet kaur
Highlights

భారత వెయిట్‌లిఫ్టర్ సర్బ్‌జీత్ కౌర్‌కు నాడా షాక్ ఇచ్చింది. నాలుగు సంవత్సారల పాటు నిషేదం విధిస్తు చర్యలు తీసుకుంది.

భారత వెయిట్‌లిఫ్టర్ సర్బ్‌జీత్ కౌర్‌కు నాడా షాక్ ఇచ్చింది. నాలుగు సంవత్సారల పాటు నిషేదం విధిస్తు చర్యలు తీసుకుంది. నేషల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో డోపిగా తేలడంతో సర్బజీత్ పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజేన్సీ నాలుగు సంవత్సరాలు నిషేదంలోపాటుగా జరిమానా విధించింది.

గతసంవత్సరం ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగిన 34వ మహిళా సీనియర్ విభాగంలోని నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లోని 71 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో సర్బ్‌జీత్ కౌర్‌ విజయం సాదించింది. ఈ ఛాపింయన్ షిప్ ముగిసిన అనంతరం నేషనల్ యాంటీ డోపింగ్ ఏజేన్పీ డోప్ కంట్రోల్ అధికారి ఆమెకు డోప్ టెస్ట్ శాంపిల్‌ను తీసుకున్నారు.

డోప్ శాంపిల్ పరీక్షలో వెయిట్‌లిఫ్టర్ సర్బ్‌జీత్ కౌర్‌ నిషేధిత ఉత్పేరక పదార్థాలైన డి-హైడ్రాక్సీ-ఎల్‌జిడి -4033, సెలెక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేషన్స్ వాడినట్లు తేలింది. ఎనోబోసార్మ్లు ఉన్నట్లు పరీక్షలో తేలింది. దీంతో సర్బ్ జీత్ కౌర్ నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ క్రీడలతోపాటు ఇతర వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.

2017 డిసెంబర్ లో కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్‌లిఫ్టర్ సీమా కూడా డోపింగ్‌కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను నాడా నాలుగు సంవత్సరాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆమె కామన్వెల్త్ గేమ్స్ లో రజతాన్ని గెలుచుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories