Champions Trophy 2025: నేడే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. తేలనున్న ఆ ఆటగాళ్ల భవితవ్యం?

Indian Team Announcement for Champions Trophy 2025 Today
x

Champions Trophy 2025: నేడే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. తేలనున్న ఆ ఆటగాళ్ల భవితవ్యం?

Highlights

Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును శనివారం ప్రకటించనున్నారు.

Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును శనివారం ప్రకటించనున్నారు. భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభమై, చివరి మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. చాలా మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరుగుతాయి. కానీ టీమ్ ఇండియా మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో జరుగుతాయి. కానీ టీమ్ ఇండియాలో ఏ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది.

జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ స్థానం దాదాపు ఖరారైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్ తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా కూడా 15 మంది సభ్యుల జట్టులో చేరనున్నారు. కానీ బుమ్రా టోర్నమెంట్‌లో ఆడతాడా లేదా అనేది అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో 752 పరుగులు చేశాడు. ఇందులో అతను అద్బుతంగా 5 సెంచరీలు చేశారు. కరుణ్ నాయర్ కు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కే అవకాశం చాలా తక్కువ. మరోవైపు, సంజు సామ్సన్ కూడా 15 మంది ఆటగాళ్ల తుది జాబితాలో చోటు దక్కించుకోకపోవచ్చు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆల్ రౌండర్ ఆటగాళ్లుగా హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లను భారత్ జట్టులో చేర్చుకోవచ్చు. మహ్మద్ షమీ జట్టులో ఉంటాడా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు షమీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు ప్రతి జట్టు తన జట్టులో మార్పులు చేసుకోగలదు కాబట్టి ఈ జట్టు ఫైనల్ కాదని గుర్తుంచుకోవాలి.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్. షమీ, మహ్మద్ సిరాజ్.

Show Full Article
Print Article
Next Story
More Stories