Fauja Singh : క్రీడా ప్రపంచంలో విషాదం.. కారు ప్రమాదంలో భారత దిగ్గజ ఆటగాడు మృతి!

Fauja Singh
x

Fauja Singh : క్రీడా ప్రపంచంలో విషాదం.. కారు ప్రమాదంలో భారత దిగ్గజ ఆటగాడు మృతి!

Highlights

Fauja Singh : పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన ఒక విషాద సంఘటనలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ కన్నుమూశారు.

Fauja Singh : పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన ఒక విషాద సంఘటనలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ కన్నుమూశారు. 114 సంవత్సరాల వయస్సులో ఫౌజా సింగ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత అతన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, అతని ప్రాణాలు దక్కలేదు. ఈ వార్త క్రీడా ప్రపంచంలో విషాదాన్ని నింపింది. జలంధర్‌లో తన ఇంటి బయట ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఫౌజా సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు.

ఫౌజా సింగ్ మరణం క్రీడా ప్రపంచాన్ని, అతని అభిమానులను తీవ్ర శోకంలో ముంచింది. ప్రజలు అతన్ని గొప్ప అథ్లెట్‌గానే కాకుండా ధైర్యానికి చిహ్నంగా గుర్తు చేసుకుంటున్నారు. పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

గులాబ్ చంద్ కటారియా X లో ఇలా రాశారు: "గొప్ప మారథాన్ రన్నర్ సర్దార్ ఫౌజా సింగ్ జీ మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. 114 సంవత్సరాల వయస్సులో 'నషా ముక్త్ – రంగ్లా పంజాబ్' మార్చ్‌లో అతను అసమానమైన ఉత్సాహంతో నాతో కలిసి నడిచారు. అతని వారసత్వం నషా ముక్త్ పంజాబ్‌కు ప్రేరణగా నిలుస్తుంది. ఓం శాంతి ఓం." అంటూ చెప్పుకొచ్చారు.

ఫౌజా సింగ్ జీవితం అందరికీ ఓ స్ఫూర్తి. సింగ్ ఐదేళ్ల వయసు వచ్చే వరకు నడవలేకపోయారు. కానీ ఆ తర్వాత అతను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. అతను 1911 లో జలంధర్‌లోని బియాస్ గ్రామంలో జన్మించారు. కుటుంబ దుఃఖాల నుండి బయటపడటానికి అతను పరిగెత్తడాన్ని తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. అలా అనేక రికార్డులను సృష్టించారు.

ఫౌజా సింగ్ బ్రిటిష్ సిక్కు, పంజాబీ భారతీయ మూలానికి చెందిన మారథాన్ రన్నర్. అతను అనేక ఏజ్ కేటగిరీలలో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. లండన్ మారథాన్ (2003) లో అతని వ్యక్తిగత బెస్ట్ టైం 6 గంటల 2 నిమిషాలు. 90 ఏళ్లు పైబడిన వయోవర్గంలో అతని బెస్ట్ టైం 2003 టొరంటో వాటర్‌ఫ్రంట్ మారథాన్‌లో 5 గంటల 40 నిమిషాలు. అప్పుడు అతనికి 92 సంవత్సరాలు..

Show Full Article
Print Article
Next Story
More Stories