IPL 2021: ధోని vs శాంసన్.. మరో మహా సంగ్రామం.. బలాబలాలు ఇవే

Chennai vs Rajasthan
x

Chennai vs Rajasthan

Highlights

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్,‌ 14వ ఎడిషన్‌లో నేడు మరో ఆసక్తికర సంగ్రామానికి తెరతీయనుంది.

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్,‌ 14వ ఎడిషన్‌లో నేడు మరో ఆసక్తికర సంగ్రామానికి తెరతీయనుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగే లీగ్ మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై, రాజస్థాన్ రెండో మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలందుకున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం అందుకుంటే., ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం అందుకుంది. అదే ఊపుతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

రెండు జట్ల బలబలాలు:

రెండు జట్ల బలాబలాల విషయానికి వస్తే ఈ టోర్నీలో చెన్నై, రాజస్థాన్ సమవుజ్జిలుగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ కుర్రాళ్లతో కనిపిస్తుంటే.. చెన్నై మాత్రం అనుభవం ఉన్న ఆటగాళ్ల నిండివుంది.

సీఎస్‌కే:

బౌలింగ్ విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ అటు బ్యాటింగ్‌లోనూ బౌలింగ్‌లోనూ బలంగా కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ బౌలింగ్ యూనిట్ సూపర్ సక్సెస్ కావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్‌ నాలుగు వికెట్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ పేసర్ పైనే చెన్నై ఆశలు పెట్టుకుంది. సౌతాఫ్రికా పేసర్ లుంగిఎంగిడి జట్టుతో కలవడంతో సీఎస్‌కే బౌలింగ్ లైనప్ పదును పెరిగింది.

సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్ తమదైన సమయంలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలరు. ఈ సారి పోరులో వారు మరింత బాధ్యత తీసుకోవాలని సీఎస్‌కే యాజమాన్యం భావిస్తోంది. బ్యాటింగ్‌లోనూ చెన్నైకి పెద్దగా సమస్యల్లేవు. టాప్ ఆర్డర్‌లో డుప్లెసిస్, మొయిన్ అలీ టచ్‌లో ఉండగా.. రాయుడు, రుతురాజ్ పూర్తి ఫామ్ లోకి రావాల్సివుంది. సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా మరింత భాద్యత తీసుకోవాలని మేనిజిమెంట్ భావిస్తోంది. కెప్టెన్ ధోనీ టచ్ లోకి రావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఫస్ట్ మ్యాచ్‌లో డకౌటైన ధోనీకి పంజాబ్‌తో మ్యాచ్‌లో చాన్స్ రాలేదు. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం ఉంది. మార్పులు చేయాలని భావిస్తే రుతురాజ్ ప్లేస్ లో ఉత్తప్పను కొనసాగించవచ్చు.

రాజస్థాన్ రాయల్స్:

తొలి మ్యాచ్‌లో వీరిచిత సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ సంజూశాంసన్ ద్వితీయ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్‌తో మిడిలార్డర్ బలంగా కనిపింస్తుంది. చెన్నైపె జరిగే మ్యాచ్ లో తన జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ టాపార్డర్ నిలకడగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓపెనర్లు జోస్ బట్లర్, మనన్ ఓహ్రా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాలి. పంజాబ్ చేతిలో దురదృష్ణవశాత్తూ ఓడిన రాజస్థా రాయల్స్.. ఢిల్లీపై గెలిచి ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుకుంది. రియాన్ పరాగ్ మరోసారి విజృంభిస్తే బ్యాటింగ్‌‌లో రాజస్థాన్‌కు తిరుగుండదు. సీనియర్ ఆటగాడు స్టోక్స్ గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో మిగతా బ్యాట్స్ మెన్ బాద్యతాయుతంగా రాణించాల్సి ఉంటుంది.

బౌలింగ్ విషయానికి వస్తే.. యంగ్ పేసర్ చేతన్ సకారియా, సీనియర్ జైదేవ్ ఉనాద్కట్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. వీరికి తోడుగా ముస్తాఫిజుర్ రెహమాన్, క్రిస్ మోరిస్ కీలక సమయంలో అండగా నిలుస్తున్నారు. రాహుల్ తెవాటియా ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ చూపించాల్సి ఉంది. రాజస్థాన్‌ ఈ మ్యాచులో మార్పులు చేసే అవకాశం కనిపించడంలేదు. మార్పులు తప్పదని భావిస్తే ఓపెనర్ మనన్ ఓహ్రా స్థానంలో యువ సంచలనం యశస్వి జైస్వాల్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

తుది జట్ల అంచనా:

చెన్నై:

ఎంఎస్ ధోని(కెప్టెన్), డుప్లెసీస్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రుతురాజ్/ఉతప్ప, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్ , జడేజా, బ్రెవో, దీపక్ చాహర్,

రాజస్థాన్:

సంజు శాంసన్ (కెప్టెన్), మనన్ ఓహ్రా / యశస్వి జైస్వాల్, బట్లర్, శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, తెవాటియా, క్రిస్ మోరిస్, ఉనాద్కట్, చేతన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

ముఖముఖిగా తలపడిన మ్యాచులు:

రెండు జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 23 సార్లు తలపడగా.. చెన్నైసూపర్ కింగ్సే పైచేయి సాధించింది. చెన్నై 14 విజయాలతో ఉంటే.. రాజస్థాన్ 9 విజయాలకే పరిమితమైంది. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ పైచేయి సాధించింది. పిచ్ కండిషన్ చూస్తే బౌలింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది.

ట్రాక్ రికార్డ్స్ విషయానికి వస్తే:

సీఎస్‌కే కెప్టెన్ థోనికిది 200వ మ్యాచ్

చెన్నై ఆటగాడు సురేశ్ రైనా రాజస్థాన్ రాయల్స్ పై 21 ఇన్నింగ్స్ల్‌లో 609 పరుగులు సాధించాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్ఆర్‌పై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ రైనా పేరిటనే ఉంది.

రాజస్థాన్ పై జడేజా 16 వికెట్లు తీసాడు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజుశాంసన్ బ్యాటింగ్ యావరేజ్ అద్భుతంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories