PT Usha: కంటతడి పెట్టిన భారత ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు

Indian Olympic Association president Cried
x

PT Usha: కంటతడి పెట్టిన భారత ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు

Highlights

PT Usha: కేరళలోని తన అకాడమీలో వేధింపులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆవేదన

PT Usha: మాజీ పరుగుల రాణి, భారత్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష కన్నీళ్లు పెట్టుకుంది. కేరళలోని తన అకాడమీలో వేధింపులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అకాడమీ స్థలంలో ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయని ఆమె కంటతడి పెట్టారు. మహిళా అథ్లెట్ల భద్రతపై పీటీ ఉష ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం సీఎం పినరయ్ విజయన్ జోక్యం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది పార్లమెంటు సభ్యురాలిగా తనను నామినేట్ చేసినప్పటి నుంచి అకాడమీలో ఆక్రమణలు, దౌర్జన్యాలు పెరిగినట్లు వివరించారు. కేరళలోని బలుసెరీలో ఉషా..స్కూల్‌ ఆఫ్ అథ్లెటిక్స్‌ను 2002లో ఆమె ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది అథ్లెటిక్స్‌కు ఆమె శిక్షణ ఇస్తున్నారు. భారత దేశానికి ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు తెచ్చేలా వారికి ట్రయినింగ్ ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories