చిక్కుల్లో పడతావ్... అభిమానుల సూచన

Virender Sehwag
x
Virender Sehwag
Highlights

యావద్ధేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం - బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పును శనివారం వెలువరించింది.

యావద్ధేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం - బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పును శనివారం వెలువరించింది. ఈ కేసులో నలబై రోజులు సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు శనివారం రోజున తీర్పును ప్రకటించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామమందిరం కోసం హిందువులకు అప్పగించాలని చెప్పింది. బాబ్రీ మసీదుకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలని పేర్కొంది.

దీనిపై భారత జట్టు మాజీ క్రికెటర్ షింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. అయోధ్య భూ వివాదం చాలా సున్నితమైన అంశం కావడంతో తన ట్వీటర్ లో శ్రీరాముడి ఫోటో పెట్టి జైశ్రీరామ్, అని కామెంట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి విరామం ప్రకటించిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యతగా వీరేంద్ర సెహ్వాగ్ కొనసాగుతున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై ఆయన అభిమానులు భిన్నంగా స్పందించారు. ట్వీట్ చూసి కొందరూ సెహ్వాగ్‌ని పొగుడుతుంటే.. మరికొందరు అభిమానులైతే చిక్కుల్లో పడతావంటూ కామెంట్ చేస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ ఈ డాషింగ్ ఓపెనర్ సెహ్శాగ్ ప్రత్యేక స్థానం అని చెప్పాలి. టెస్టు కెరీర్ లో 104 మ్యాచ్ లు ఆడిన అతడు 8,586 పరుగులు సాధించాడు. భారత ఆటగాళ్లలో వ్యక్తిగత అత్యధిక స్కోర్

319 పరుగుల రికార్డు సెహ్వాగ్ పేరిటే ఉంది. వన్డేలలోనూ 251 మ్యాచులు ఆడి 244 ఇన్నింగ్స్‌లో 8,273 పరుగులు నెలకొల్పాడు. వన్డే ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 19టీ20లు ఆడిన అతడు 394 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఢిల్లీ , పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories