ఈ ఏడాది టీమిండియా షెడ్యూల్ ఇదే..

ఈ ఏడాది టీమిండియా షెడ్యూల్ ఇదే..
x
Highlights

టీమిండియా 2019లో కనబరిచిన ఆట తీరులానే 2020లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తుంది.

భారత క్రికెట్ జట్టుకు ఒక ప్రపంచ కప్ మినహాయించి 2019లో ప్రపంచ క్రికెట్లో అత్యధిక విజయాలు సొంతం చేసుకుంది. జట్టులో బౌలర్లు బ్యాట్స్ మెన్లు అంతా సమిష్టిగా రాణించి ఈ ఏడాది అత్యత్తమ జట్టుగా నిలిచింది. టీమిండియా 2019లో కనబరిచిన ఆట తీరులానే 2020లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తుంది.

2020లో జనవరి 5నుంచి శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడుతుంది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా టెస్టు, వన్డే , టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. 2020 మార్చిలో ఐపీఎల్‌ సిద్ధంగా ఉంటుంది. ఇక జూన్‌లో శ్రీలంకతో సిరీస్‌లు మొదలవుతుంది. ఆగస్టులో జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. సెప్టెంబర్‌లో ఆసియాకప్‌ ఆడనుంది. ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. అక్టోబర్‌లోనే టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. 2020ని కూడా ఘనంగా ఆరంభించాలని భారత క్రికెట్ జట్టు భావిస్తుంది. ఆసియాకప్, టీ20 ప్రపంచ కప్ పై దృష్టి సారించింది.

అయితే 2020నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన టీమిండియాకు ఈ సంవత్సరం పూర్తి క్యాలెండర్ ను పరిశీలిద్దాం. 2020లో టీమిండియా క్యాలెండర్ ఈ ఏడాది ఆరంభంలోనే టీమిండియా శ్రీలంక జట్టుతో మూటీ టీ20లు ఆడనుంది. ఇక అక్టోబర్ లో జరిగే ఆస్ట్రేలియాతో జరిగే మూడు ఫార్మాట్లు సిరీస్ చివరిది..

2020లో టీమిండియా క్యాలెండర్:

జనవరి 5-శ్రీలంక తొలి టి20 (గువాహటి)

♦ జనవరి 7- శ్రీలంక రెండో టి20 (ఇండోర్‌)

♦జనవరి 10-శ్రీలంక మూడో టి20 (పుణే)

♦ జనవరి 14-ఆస్ట్రేలియా తొలి వన్డే (ముంబై)

♦ జనవరి 17-ఆస్ట్రేలియా రెండో వన్డే (రాజ్‌కోట్‌)

♦ జనవరి 19-ఆస్ట్రేలియా మూడో వన్డే (బెంగళూరు)

♦ జనవరి 24-న్యూజిలాండ్‌ తొలి టి20 (ఆక్లాండ్‌)

♦ జనవరి 26-న్యూజిలాండ్ రెండో టి20 (ఆక్లాండ్‌)

♦ జనవరి 29- న్యూజిలాండ్ మూడో టి20 (హామిల్టన్‌)

♦ జనవరి 31-న్యూజిలాండ్‌ నాలుగో టి20 (వెల్లింగ్టన్‌)

♦ ఫిబ్రవరి 2-న్యూజిలాండ్‌ ఐదో టి20 (మౌంట్‌ మాంగనీ)

♦ ఫిబ్రవరి 05- న్యూజిలాండ్‌ తొలి వన్డే (హామిల్టన్‌)

♦ ఫిబ్రవరి 08-న్యూజిలాండ్‌ రెండో వన్డే (ఆక్లాండ్‌)

♦ ఫిబ్రవరి 11- న్యూజిలాండ్ మూడో వన్డే (మౌంట్‌ మాంగనీ)

♦ ఫిబ్రవరి 21-న్యూజిలాండ్‌ తొలి టెస్టు (వెల్లింగ్టన్‌)

♦ ఫిబ్రవరి 29 -న్యూజిలాండ్ రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్‌)

♦ మార్చి 12 - దక్షిణాఫ్రికా తొలి టి20 (ధర్మశాల)

♦ మార్చి 15 -దక్షిణాఫ్రికా రెండో టి20 (లక్నో)

♦ మార్చి 18 -దక్షిణాఫ్రికా మూడో టి20 (కోల్‌కతా)

♦ ఏప్రిల్‌ - ఐపీఎల్‌ సీజన్

♦ జూన్‌- శ్రీలంకలో టీమిండియా పర్యటన 3 వన్డేలు, 3 టీ20ల మ్యాచ్

♦ ఆగస్టు- జింబాబ్వేలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు)

♦ సెప్టెంబర్- ఆసియా కప్‌ టోర్నీ

♦ సెప్టెంబర్‌- భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టు పర్యటన (3 వన్డేలు, 2 టి20లు)

♦ అక్టోబర్-ఆస్ట్రేలియాలో టీమిండియా జట్టు పర్యటన (3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories