HBD కోహ్లి.. ఇండియన్ టీం కెప్టెన్ కి సోషల్ మీడియా విషెస్....

Happy Birthday kohli
x
Happy Birthday kohli
Highlights

టీం ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ రోజు జన్మదిన వేడుకలని జరుపుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో విరాట్ కోహ్లికి ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా...

టీం ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ రోజు జన్మదిన వేడుకలని జరుపుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో విరాట్ కోహ్లికి ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు. దీనితో ట్విట్టర్ టాప్ ట్రెండ్, సెకండ్ టాప్ ట్రెండ్... రెండూ విరాట్ కోహ్లీతోనే నిండిపోయాయి..తన అట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు కోహ్లి..

15 ఏళ్ల వయసు నుంచే క్రికెట్‌లో అడుగుపెట్టాడు కోహ్లి... ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ 2008లో అండర్ 19 ప్రపంచ కప్ కి కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. అప్పుడే అండర్ 19 వరల్డ్ కప్ ని సాధించి పెట్టాడు. ఆ తర్వాత జట్టులో చోటు సంపాదించి ఆడినా ప్రతి మ్యాచ్ లో సత్తా చాటాడు. అనతి కాలంలోనే ది బెస్ట్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీం ఇండియా జట్టుకు ఎంతో మంది సీనియర్ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ కోహ్లినే కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా సత్తా చాటుతూ జట్టును ముందుకు నడిపాడు కోహ్లి.. దాయాది దేశం అయిన పాకిస్తాన్ కూడా మాకు కోహ్లి కావాలి అనే స్థాయికి కోహ్లి వెళ్ళాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ప్రపంచ రెండో బెస్ట్ బ్యాట్స్‌మేన్‌గా ఉన్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లీ ఆడట్లేదు. ఆ తర్వాత జరిగే టెస్ట్ సిరీస్ కి కోహ్లి ఆడతాడు. విరాట్ కోహ్లి సినీ నటి అనుష్కశర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories