సైనా నెహ్వాల్ కు కరోనా పాజిటివ్! థాయిలాండ్ టోర్నీకి దూరం!!

Saina Nehwal tested corona positive
x
సైనా నెహ్వాల్ (ఫైల్ ఇమేజ్) 
Highlights

భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇంతకు ముందే ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లో గడిపిన సైనాకు రెండోసారి పాజిటివ్ వచ్చిందనే వార్తా సంచలనం సృష్టిస్తోంది.

ఈరోజు నుంచి థాయిలాండ్ ఓపెన్ సూపర్‌-1000 టోర్నీ ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో సైనా కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం భారత శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా వైరస్ కారణంగా పది నెలల పాటు ఇంటికే పరిమితమైన బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఇప్పుడు థాయిలాండ్ టోర్నీలో పాల్గోవడానికి సిద్ధం అయ్యారు. థాయిలాండ్ లో క్రీడాకారులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది. వాస్తవానికి ఈరోజు తన మొదటి మ్యాచ్ లో సైనా మలేసియాకు చెందిన షట్లర్‌ కిసోనా సెల్వడురేతో తలపడాల్సి ఉంది. సైనాను టోర్నీ నుంచి తప్పుకోవలసినదిగా బీడబ్ల్యూఎఫ్‌ కోరింది. సైనా తో పాటు మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రణయ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే కరోనా సోకడంతో క్వారంటైన్ లో గడిపిన సైనా తిరిగి కరోనా కోరల్లో చిక్కుకోవడంతో భారత బ్యాడ్మింటన్ రంగంతో పాటు క్రీడాభిమానులంతా ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories