PV Sindhu -T.Y.Tai : ఫైనల్ లో ఓడిన ప్రత్యర్ధిని ఓదార్చిన భారత "బంగారం"

Indian Badminton Player PV Sindhu Consolation to T.Y. Tai to Loose in Final Olympic Badminton Match
x

PV Sindhu - T.Y. Tai

Highlights

*సెమీస్ లో టై పై ఓడిన పీవి సింధు * ఫైనల్ టై ఓడిపోవడంతో ఓదార్చిన సింధు *సింధు నిజాయితీకి ధన్యవాదాలు తెలిపిన తైజుయింగ్ టై

PV Sindhu - T.Y. Tai : "ఒకసారి అనుభవిస్తే కాని బాధ అంటే ఏంటో ఎదుటివారికి అర్ధంకాదని" అంటుంటారు పెద్దలు. తాజాగా అదే సంఘటన టోక్యో ఒలింపిక్స్ లో చోటు చేసుకుంది. టోక్యో మహిళల బాడ్మింటన్ పోటీలో సెమీ ఫైనల్ లో తైజు యింగ్ పై ఓడిన పీవి సింధు ఆ తర్వాత కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో హి బిగ్జియవో పై గెలుపొంది భారత్ తరపున కాంస్య పతకాన్ని సాధించి పెట్టింది. అయితే సెమీస్ లో సింధు పై గెలిచిన తైజు యింగ్ టై ఫైనల్ లో చైనాకి చెందిన చెన్ యుఫీ చేతిలో 19-21, 21-19, 19-21 తో చివరి వరకు పోరాడి ఓడిన తనను సింధు ఓదార్చిన తీరు మరిచిపోలేనని కన్నీళ్ళ పర్యాంతమయ్యింది.

మొదటి నుండి పోటాపోటీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చివరికి తైజు యింగ్ కు చేదు ఫలితం రావడంతో పీవి సింధు వెంటనే వచ్చి తన పరిస్థితి అర్ధం చేసుకొని ఓదార్చిందని, గత ఒలింపిక్స్ లో ఓడిన జరిగిన అనుభవంతో చెపుతున్న ఈ సమయంలో నీ ఆట తీరు అద్భుతం కాని ఈరోజు నీది కాదు అని ఈ పరిస్థితిలో ఎలా ఉంటుందో తనకు తెలుసని తనను పీవీ సింధు ఓదార్చిన తీరు మరిచిపోలేనని ఆ సమయంలో నాకు కన్నీళ్ళు ఆగలేదని తన ఇన్స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ఇప్పటికే మూడు ఒలింపిక్స్ లో పాల్గొన్నానని ఫైనల్ వరకు చేరడం మరిచిపోలేను అని ఇక తర్వాతి ఒలింపిక్స్ లో ఆడుతానో లేదో తెలియదని చెప్పుకొచ్చింది. తన ప్రత్యర్ధి అయి తన చేతిలో ఓడిన కూడా ఫైనల్ లో ఆదే ప్లేయర్ ఓడిపోవడంతో పీవి సింధు ఓదార్చిన తీరు గొప్పదని పలువురు ప్రశంసలు కురిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories