3 కాంస్య పతకాలు సాధించిన భారత ఆర్చర్లు

3 కాంస్య పతకాలు సాధించిన భారత ఆర్చర్లు
x
Atanu Das
Highlights

ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌ మహిళల టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో స్వర్ణం రేసులో నిలిచింది. అద్భుత ప్రదర్శన కనబరిచి...

ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌ మహిళల టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో స్వర్ణం రేసులో నిలిచింది. అద్భుత ప్రదర్శన కనబరిచి మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్ వర్మతో కలిసి ఇప్పటికే ఫైనల్ చేరింది. కాగా. మంగళవారం జరిగిన కాంఫౌండ్ విభాగంలో ముస్కాన్ కిరాన్, ప్రియా గుర్జర్ లతో కలిసి బంగారు పతకానికి అర్హత సాధించింది.

మంగళవారం జరిగిన పోరులో భారత ఆర్చర్లు 3 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో అతాను దాస్‌ కాంస్యం సాధించాడు. అతాను దాస్‌ 6–5తో దక్షిణకొరియా ఆటగాడు జిన్‌ హాయెక్‌ పై విజయం సాధించాడు. పురుషుల రికర్వ్‌ విభాగలో తరుణ్‌దీప్‌ రాయ్, జయంత తాలుక్‌దార్‌, అతాను దాస్, కాంస్యం సాధించారు. మహిళల రికర్వ్ విభాగంలో అంకిత దీపిక కుమారి, బొంబేలా దేవి, జపాన్ క్రీడాకారులపై విజయం సాధించారు. మోహన్‌ భరద్వాజ్‌,అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్‌ లో ప్రవేశించింది.

ఉమెన్ టీమ్ కాంపౌండ్ సెమీఫైనల్లో సురేఖ, ప్రియ, ముస్కాన్ 229-221తో ఇరాన్ జట్టు క్రీడాకారులు సయ్యదా, పార్సి అరెజు జట్టను ఓడించింది. మొదటి రౌండ్‌లో 'బై' పొందిన భారత జట్టు క్వార్టర్స్ లో 226–225తో థాయ్‌లాండ్‌ జట్టు క్రీడాకారులు కనోక్‌నాపుస్, కన్యవీ, నారెయుమోన్‌లతో పోటీపడి గెలిచింది. బుధవారం జరిగే ఫైనల్ కొరియాతో భారత్ పోటీపడనుంది. భారత ఆర్చరీ సంఘంపై నిషేదం ఉండటంతో భారత్ కు చెందిన క్రీడాకారులు వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ కింద ఆడుతున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories