India vs Australia Live: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

India vs Australia Live: కాసేపట్లో భారత్, ఆసిస్ మధ్య టఫ్ ఫైట్

Rama Rao
Published on: 25 Sept 2022 6:59 PM IST
India won the toss and chose to field
X

India vs Australia Live: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

India vs Australia Live: కాసేపట్లో హైదరాబాద్‌ వేదికగా భారత్, ఆసిస్ మధ్య టీ 20 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రోహిత్ సేన.. ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇటు ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని తెలుస్తోంది. దీంతో స్కోర్ భారీగా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు భారత్.. ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. టీమ్ నుంచి పంత్ దూరం కాగా.. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌కు చోటు కల్పించారు. ఇటు రెండు జట్లు చెరో మ్యాచ్‌ను నెగ్గడంతో.. లాస్ట్ టీ20 లో గెలిచిన జట్టు సిరీస్‌ సొంతం చేసుకోనుంది. దీంతో రెండు జట్ల మధ్య టఫ్ ఫైట్ తప్పదని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే పెద్ద సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్.. స్టేడియానికి చేరుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story