India vs South Africa 2nd test: సాధికారక విజయం

India vs South Africa 2nd test: సాధికారక విజయం
x
Highlights

అన్నిరంగాల్లో ఆల్ రౌండ్ ప్రతిభతో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. పూనే లో దక్షిణాఫ్రికా ను ఫాలో ఆన్ ఆడించి.. రెండో ఇన్నింగ్స్ వరకూ మ్యాచ్ ముందుకు వెళ్ళే పని లేకుండా దిగ్విజయాన్ని నమోదు చేసి సిరీస్ కూడా తన ఖాతాలో వేసుకుంది.

పుణె వేదికగా జరిగిన దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి 2-0 సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడిన సఫారీలు మూడో సెషన్ ఆరంభంలోనే 189 పరుగులకు అలౌటయ్యింది.

ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ని 601/5తో డిక్లేర్ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆలౌటైంది. కాగా.. 326 పరుగుల భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. కాగా రెండో ఇన్నింగ్స్ ఫాలోఆన్ ఆడించి 189 పరుగులకే కుప్పకుల్చగలిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories