IND vs BAN 2nd Test: కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం.. బంగ్లా‌పై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్.. డబ్యూటీసీలోనూ తగ్గేదేలే

India won by 7 wickets against Bangladesh
x

IND vs BAN 2nd Test: కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం.. బంగ్లా‌పై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్.. డబ్యూటీసీలోనూ తగ్గేదేలే

Highlights

India vs Bangladesh, 2nd Test: కాన్పూర్ టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో టీమిండియా 2-0తో సిరీస్‌ని క్లీన్‌స్వీప్‌...

India vs Bangladesh, 2nd Test: కాన్పూర్ టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో టీమిండియా 2-0తో సిరీస్‌ని క్లీన్‌స్వీప్‌ చేసింది. వర్షం ప్రభావంతో చివరి రోజైన మంగళవారం భారత్‌కు 95 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మెన్స్ 17.2 ఓవర్లలోనే సాధించారు. యశస్వి జైస్వాల్ 51 పరుగులు చేశాడు. కోహ్లీ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

లంచ్‌కు ముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 146 పరుగులకు ఆలౌట్ చేసింది. బంగ్లాదేశ్ జట్టు 26/2 స్కోరుతో రోజు ప్రారంభించింది. సోమవారం భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా 233 పరుగులకు ఆలౌట్ చేసింది. వర్షం కారణంగా, మూడు, రెండవ రోజుల ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే మొదటి రోజు 35 ఓవర్లు మాత్రమే వేయగలిగారు. ఇటువంటి పరిస్థితిలో, మ్యాచ్ దాదాపు డ్రా అవుతుందని భావించారు. కానీ భారత జట్టు గత 2 రోజుల్లో మొత్తం చిత్రాన్ని తలకిందులు చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories