IND Vs NZ: ప్రపంచకప్‌లో భారత్‌కు ఐదో విజయం..!

India Won By 4 Wickets
x

IND Vs NZ: ప్రపంచకప్‌లో భారత్‌కు ఐదో విజయం..!

Highlights

IND Vs NZ: ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం

IND Vs NZ: వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన 5 వన్డేల్లోనూ విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలోనూ రోహిత్‌ సేన విజయఢంకా మోగించింది. న్యూజిలాండ్‌ వరుస విజయాలకు కళ్లెం వేసింది మెన్‌ ఇన్‌ బ్లూ. ఈ విజయంతో 10 పాయింట్లతో టాప్‌-1 ప్లేస్‌కు చేరుకుంది టీమిండియా.

న్యూజిలాండ్‌పై భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 48 ఓవర్లలోనే న్యూజిలాండ్‌ విధించిన విజయ లక్ష్యాన్ని భారత్‌ ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. 50 ఓవర్లలో 273 పరుగులకే ఆలౌట్‌ అయింది. మహ్మద్‌ షమి 5 వికెట్లు తీసి కివీస్‌ నడ్డి విరిచాడు. కుల్దీప్‌ 2, బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో న్యూజిలాండ్‌ 50 ఓవర్లకు 273 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత.. 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్లు దూకుడుగానే ఆడారు.

11వ ఓవర్‌లో 71 పరుగులు చేసిన తర్వాత.. ఫెర్గూసన్ బౌలింగ్ లో బౌల్డయి రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ వెంటనే శుభ్ మన్ గిల్ నూ ఫెర్గూసన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.. పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో.. జట్టు స్కోర్ ను చక్క దిద్దే బాధ్యత మరోమారు విరాట్ కోహ్లీపై పడింది. రవీంద్ర జడేజాతో కలిసి కింగ్‌ కోహ్లీ టీమ్‌ను విజయ పథంలో నడిపించారు. చివర్లో 95 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో.. రవీంద్ర జడేజా ఫోర్ తో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును గెలిపించాడు. కోహ్లి 95 పరుగులు చేసి జస్ట్‌లో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఇక.. రోహిత్‌ 46 పరుగులు, జడేజా 39, శ్రేయస్‌ 33, రాహుల్‌ 27, గిల్‌ 26 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఫెర్గూసన్‌ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్‌, హెన్రీ, శాంట్నర్‌కు చెరో వికెట్‌ దక్కింది. కివీస్‌పై గెలుపుతో భారత్‌ పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకెళ్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories