ICC T20 World Cup : లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న షెఫాలీ వర్మ

ICC T20 World Cup : లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న షెఫాలీ వర్మ
x
India Vs Srilanka ICCT20World Cup
Highlights

మహిళల టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌ శ్రీలంక మధ్య లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ ఆడుతోంది. శ్రీలంక 114 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని చేధించే...

మహిళల టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌ శ్రీలంక మధ్య లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ ఆడుతోంది. శ్రీలంక 114 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ స్మృతి మంధాన(17) పరుగులతో మరోసారి విఫలమైంది. మరో డాషింగ్ ఓపెనర్ బిగ్ హిట్టర్ షెఫాలీ వర్మతోపాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(15), పరుగుల శశికల బౌలింగ్ లో పెవిలియన్ చేరింది. షెఫాలీ వర్మ ఆర్థ శతకానికి మూడు పరుగుల వద్ద ఉండగా..జెమిమా రోడ్రిగ్స్ సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయింది. దీంతో భారత్ 10 ఓవర్లలో మూడు వికెట్ల వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంకకు ఆ జట్టు ఓపెనర్లు టీమిండియా బౌలర్లు షాక్ ఇచ్చారు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక తొమ్మిది వికెట్ల 113 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ ఉమేశ (2) దీప్తి శర్మ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి రాజేశ్వరి చేతికి దొరికింది. కెప్టెన్ ఆటపట్టు(33, 24 బంతుల్లో , 5 ఫోర్లు, 1 సిక్సు) టాప్ స్కోరర్. హర్షిత (12), హాసిని(7), కరుణరత్నె (7), నీలాక్షి డి సిల్వా(8) వరుస వికెట్లు కోల్పోయింది. ప్రబోధని(2) పరుగులతో చివరల్లో కవిశా దిల్హారి(25 , 16 బంతుల్లో, 2పోర్లు నాటౌట్) రాణించిడంతో శ్రీలంక ఆ మాత్రం స్కోరు చేయకలిగింది. భారత బౌలర్లలో రాధాయాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. గౌక్వాడ్ రెండు, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌, శిఖ పాండే తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories