Champions Trophy Final : ఉత్కంఠకరమైన మ్యాచ్‌ గెలిచి ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్

Champions Trophy Final : ఉత్కంఠకరమైన మ్యాచ్‌ గెలిచి ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్
x
Highlights

Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ లో న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరుకు...

Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ లో న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరుకు కివీస్ ను మట్టి కరిపించి టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలలో 251 పరుగులు చేసింది. దీంతో 252 పరుగుల లక్ష్య ఛేదనకు టీమిండియా దిగింది.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇద్దరూ పర్వాలేదనుకున్న సమయంలోనే అవుటయ్యారు. దీంతో స్కోర్ మొత్తం ఒక్కసారిగా డౌన్ అయింది. దీంతో కాసేపు టీం ఇండియా కష్టాల్లో పడ్డట్లు అనిపించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐసీసీ టోర్నమెంట్లలో ఏ ఫైనల్లోనైనా రోహిత్ చేసిన అతిపెద్ద ఇన్నింగ్స్ ఇది. కానీ 27వ ఓవర్లో అనవసరమైన షాట్ ఆడుతూ తన వికెట్ కోల్పోయాడు.

252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శుభమాన్ గిల్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు, ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా కేవలం 1 పరుగు చేసి పెవిలియన్ కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత, రోహిత్ శర్మ కొంతసేపు జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి, అనవసరమైన షాట్ ఆడుతూ స్టంప్ అవుట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర వేసిన 27వ ఓవర్ మొదటి బంతికి రోహిత్ శర్మ ముందుకు కదిలి పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అతడు కొట్టిన బంతి నేరుగా కీపర్ టామ్ లాథమ్ చేతుల్లోకి వెళ్ళింది. రోహిత్ శర్మ స్టంపౌట్ అయ్యాడు.

83 బంతుల్లో 76 పరుగులు చేసిన ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యార్ నిలకడగా ఆడి 48పరుగులు చేశాడు. 48 పరుగుల దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అది జరిగిన కొద్ది సమయంలోనే అక్షర్ పటేల్ ఫెవీలియన్ కు చేరాడు. తను 40 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఒకానొక దశలో మ్యాచ్ గెలవడం కష్టమే అనుకున్న సమయంలో రాహుల్ నిలకడగా రాణించాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హార్ధిక్ వేగంగా ఆడి భాతర జట్టు విజయం పై ఆశలు పెంచాడు. 18 పరుగుల వద్ద అనవసర షాట్ ఆడి అవుట్ అయ్యాడు.

తర్వాత జడేజా క్రీజులోకి వచ్చి వరుసగా పరుగులు చేసి టీం ఇండియాకు విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లు జేమీసన్ ఒకటి, శాంటర్న్ 2, రవీంద్ర ఒక వికెట్ తీసుకున్నారు. నాలుగు వికెట్ల తేడాతో టీం ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories