విశాఖ చేరుకున్న రెండు జట్లు

విశాఖ చేరుకున్న రెండు జట్లు
x
Team India bus
Highlights

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. బుధవారం రెండో వన్డే మ్యాచ్...

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. దీంతో రెండు జట్లు స్టేడియంకు చేరుకున్నాయి. ఎయిర్ పోర్టు నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ నోవాటెల్‌ హోటల్‌కు ఆటగాళ్లు విండీస్ -టీమిండియా జట్లు చేరుకున్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖ ఎయిర్ పోర్టుకు క్రికెటర్లు చేరుకున్నారు. ఈసందర్భంగా రెండు జట్లు ఆటగాళ్లుకు ఘన స్వాగతం పలికారు.

కాగా, దారిపొడవునా కోహ్లీ, కోహ్లీ.. అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆదివారం చపాక్ వేధికగా జరిగిన తొలి వన్డేలో అయితే ఆదివారం జరిగిన మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డే భారత్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మొదటి వన్డేలో భారత్ నిర్దేశించిన 288 పరుగుల విజయ లక్ష్యాన్ని విండీస్ ఆడుతూపాడుతూ ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేస్తే.. 47.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ 291 చేసి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన హెట్‌మెయిర్‌ను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు.

ఇక రెండో వన్డే మ్యాచ్ డై/నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాఖపట్నంతో రోహిత్ శర్మకు మంచి అనుబంధం ఉంది. విశాఖ రోహిత్ శర్మ అమ్మఅమ్మ వాళ్ల ప్రాంతం కావడం విశేషం. రోహిత్ పుట్టింది ముంబయిలోని బాన్సాడ్ అయినప్పటికీ, రోహిత్ శర్మ వాళ్ల అమ్మ పూర్ణిమ సొంతూరు విశాఖనే. దీంతో ఇది రోహిత్‌కు సొంత గడ్డ అనే చెప్పాలి. అయితే తనకు విశాఖలో మ్యాచ్ ఆడడం అంటే ఇష్టమని రోహిత్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ రాణిస్తాడని అభిమానులు కోరుకుంటున్నారు. మూడు వన్డేల సిరీస్ 1-0తో విండీస్ ముందజలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో విండీస్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories