భారత జట్టులో ఈ మార్పులు తప్పవు.. లేదంటే విండీస్ సంచలనం ఖాయం..

భారత జట్టులో ఈ మార్పులు తప్పవు.. లేదంటే విండీస్ సంచలనం ఖాయం..
x
India vs West Indies 3rd t20
Highlights

టీమిండియా వరుస సిరీస్ విజయాలకు విండీస్ బ్రేక్ వేస్తుందా? అనామక ఆటగాళ్లతో ఆడుతున్న విండీస్ టీ20 సిరీస్ కైవసం చేసుకుంటుందా? తిరువనంతపురం మ్యాచ్ విజయంతో...

టీమిండియా వరుస సిరీస్ విజయాలకు విండీస్ బ్రేక్ వేస్తుందా? అనామక ఆటగాళ్లతో ఆడుతున్న విండీస్ టీ20 సిరీస్ కైవసం చేసుకుంటుందా? తిరువనంతపురం మ్యాచ్ విజయంతో విండీస్ ధీమాగా ఉంది. మరో వైపు భారత్ కు సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. అంతే కాకుండా మెరుగైన బౌలింగ్ ఉంది. అయినప్పటికీ కోహ్లీ సేనకు కలవరపాటు తప్పడం లేదు. ఫిల్డింగ్ లోపం భారత్ ను వెంటాడుతుంది. గెలవాల్సిన మ్యాచ్ లు చేతులారా పోగొట్టుకుంటుంది. మొదటి టీ80లో 4 క్యాచ్ లు మిస్ చేసుకుంది, రెండో టీ20లో 8 క్యాచులు నెలవిడిచింది. దీనిపై కోహ్లీ స్పందించారు. మా ఫిల్డింగ్ చాలా చెత్తగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వాఖండే వేధిక మూడో టీ20లో ఈ సమస్యను అధిగమించకపోతే మాత్రం చాలా కష్టం. రెండో ఇన్సిగ్స్ ఆరంభించాలంటే మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విండీస్ టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంటే మాత్రం భారత్ కు మూడో టీ20 విజయం ప్రశ్నార్థకమే?

శివమ్ దూబే

మొదట రెండు టీ20ల్లో భారత్ ఫేస్ బౌలర్లు విఫలమైయ్యారని విమర్శలు వస్తున్నాయి. చాహర్‌, భువనేశ్వర్ త్వరగా ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్‌ సుందర్‌ పరుగులు తక్కువగా ఇస్తున్న వికెట్ టేకర్ అనిపించుకోవడం లేదు. రెండో టీ20లో కోహ్లీ స్థానంలో మూడో బ్యాట్స్ మెన్ గా బరిలోకి వచ్చిన శివమ్ దూబె మెరుపు ఇన్నింగ్స్ అందరిని ఆటకట్టుకుంది. భారత ఓపెనర్ల రాహుల్, రోహిత్ కీలక భాగస్వామ్యం నెలకొప్పడంతో విఫలమవుతున్నారు. ఇద్దరూ కలిసి రాణిస్తే మ్యాచ్ భారత్ కు ఎదురుండదు. ఉప్పల్ టీ20లో విజృంభించిన కోహ్లీ కూడా రెండో టీ20 స్వల్ప స్కోరుకే ఔటైయ్యాడు. అతను కూడా వాఖండేలో రాణిస్తే టీమిండియా విజయం సునాయసంగా వరిస్తుంది.

రిషబ్ పంత్ ఫామ్..

రిషబ్ పంత్ ఫామ్ భారత్ ను కలవరపెడుతుంది. రిషబ్ అడపదడప రాణిస్తున్నాడే తప్ప పూర్తిగా ఫామ్ అందుకోలేదు. అతన్ని తొలగించి అతని స్థానంలో శాంసన్ ఆడించాలని సీనియర్లు సలహాలు ఇస్తున్నారు. జింబాబ్వేపై ఒక టీ20 మ్యాచ్ ఆడాడు సంజు శాంసన్‌. ఆ త్వారత బంగ్లాదేశ్‌ సిరీన్‌లో చోటు దక్కుతుందని భావించారు నిరాశ ఎదురైంది. కీలకమైన వాంఖడే మ్యాచ్‌లో అతడికి చోటు

దక్కుతుందా అన్న సందేహాలు మొదలైయ్యాయి. కోహ్లీ మద్దతు పూర్తి స్థాయిలో పంత్ కు ఉంది. దీంతో పంత్ ను పక్కన పేట్టే సహాసం చేయరు. రాహుల్ ఫామ్ లో ఉండడంతో అతన్ని తొగించడు. దీంతో మూడో మ్యాచ్ లో మార్పులు లేకుండా ఇదే జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.

విండీస్ ధీమా

తిరువనంతపురం గెలుపుతో పొలార్డ్‌ సేనలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఓపెనర్లు సిమన్స్‌, లూయిన్‌,ఫామ్ లో ఉండడం. బ్రాండన్‌ కింగ్‌, హెట్‌మైయిర్‌, పూరన్‌, పొలార్డ్‌ హోల్డర్‌ రాణిస్తుండడంతో విండీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. విండీస్ కు ప్రాదాన సమస్య బౌలింగ్ ఒక్కటే బౌలర్లు పెద్దగా రాణించపోవడంతో ప్రత్యర్థి జట్టు భారీ స్కోరుకు బీటలు వెస్తుంది. ఐపీఎల్ లో ముంబై తరపున ఆడిన విండీస్ కెప్టెన్ పోలార్డ్‌కు వాఖండే మైదానం సొంత మైదనంలా భావిస్తున్నాడు. రెండో టీ20 విజయం మీద ఉన్న విండీస్ వాఖండేలో కూడా విజయం సాధించి సిరీస్ గెలవాలని చూస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories